Home తాజా వార్తలు వెంకటాపూర్‌లో చిరుత సంచారం…భయాందోళనలో ప్రజలు

వెంకటాపూర్‌లో చిరుత సంచారం…భయాందోళనలో ప్రజలు

Cheetah

సిరిసిల్ల: సిరిసిల్ల రేంజ్ పరిధిలో వెంకటాపూర్ సెక్షన్‌లో అక్కపల్లి బీట్ ప్రాంతంలో చిరుతపులి సంచరించడంతో కలకలం రేగుతోంది. మూడు రోజుల క్రితం పోతిరెడ్డిపల్లి రైతు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లుతుండగా అటవీ ప్రాంతం పక్కన గల తన పొలం వద్దకు వెళ్లాడు. అయితే పొలానికి దగ్గర్లో  ఉన్న చిరుత రైతును చూసి దాడి చేసే ప్రయత్నం చేయడంతో గ్రామంలోకి పరుగులు పెట్టాడు. అంతకు ముందు వెంకటాపూర్‌లో దూడ పై దాడి చేసి చంపింది. అదే విధంగా శివంగళపల్లిలో మేక పై దాడి చేసి చంపేసింది.దీంతో ఈప్రాంత ప్రజలు చిరుతపులి సంచారంతో భయం గుప్పిట్లో ఉన్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులకు వివరించగా, రాత్రి పూట వ్యవసాయ పనులకు అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లిన ఇద్దరు, ముగ్గురు కలిసి వెళ్లాలనీ అధికారులు సూచించారు.

భయాందోళనలో ప్రజలు…
వెంకటాపూర్ ఫారెస్ట్ సెక్షన్ పరిధిలో గల పోతిరెడ్డిపల్లి, ధర్మారం, శివంగళపల్లి, అక్కపల్లి, దూమాల, నిజామాబాద్ గ్రామాల ప్రజలు ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న విషయం తెలియడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు భయటకు వెళ్లెందుకు జంకుతున్నారు. ఎప్పుడు చిరుతపులి వచ్చి తమ పై, పశువుల పై దాడి చేస్తుందనీ ప్రజలు నిత్యం వణికి పోతున్నారు.

Cheetah wandering in Venkatapur Village Sircilla District