Home Default నిషేధంపై అదే నిరసన

నిషేధంపై అదే నిరసన

  • ఐఐటి మద్రాస్‌లోనూ బీఫ్ ఫెస్టివల్
  • కేంద్రంపై మమత, మాయావతి ధ్వజం

Beef-Festival

చెన్నై/కోల్‌కతా: కేరళ తర్వాత ఇపుడు ఐఐటి-మద్రాస్ లోనూ బీఫ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. వధశాలలకు పశువులను తరలించరాదంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఐఐటి-మద్రాస్‌కి చెందిన కొంతమంది విద్యార్థుల బృందం ఆదివారం రాత్రి బీఫ్ ఫెస్టివల్‌ని జరుపుకుంది. తద్వారా ప్రభుత్వ నిర్ణయం పై నిరసనను తెలియజేసింది. యాభై మందికి పైగా విద్యార్థులు ఈ నిరసన ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. కాగా, ఈ నెల 27న భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో కొంతమంది విద్యార్థులు కేరళ లోని త్రివేండ్రం యూనివర్శిటీ కాలేజి బయట బీఫ్ తింటూ ఇదే తరహా నిరసనను వ్యక్తం చేశారు. ఇలాం టి ఫెస్టివళ్లను ఆ రాష్ట్రంలోని కొల్లాం జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోనూ నిర్వహించారు. బహిరంగ మార్కెట్ల నుండి పశువులను క్రయవిక్రయాలు జరిపి వాటిని వధశాలలకు తరలించకుండా కేంద్ర పర్యావర ణ, అటవీ, పర్యావరణ మార్పు శాఖ మంత్రి హర్ష వర్థ న్ పశువుల సంరక్షణ కోసం కొన్ని కఠినమైన నిబం ధనలను జారీ చేసిన సంగతి తెలిసిందే. జంతువుల మార్కెట్‌ను, ఈ మార్కెట్లలో పశువుల అమ్మకాలను క్రమబద్ధీకరించడంతో పాటు మార్కెట్లలో పశువుల సం రక్షణను చూడటం లాంటివి ఈ నిబంధనల్లో ముఖ్య మైనవి. అంతేకాక ముఖ్యంగా వధకోసం తాము మా ర్కెట్ల నుండి పశువులను కొనుగోలు చేయడం లేదా అమ్మడం చేయలేదంటూ క్రయవిక్రయదారులు హామీ ఇవ్వాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది.
కేంద్రం జోక్యం తగదు : మమతా బెనర్జీ
పశువుల క్రయవిక్రయాలు, జంతువధ పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడ మేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. సోమవారం రాష్ట్ర సచివాల యంలో మీడియా సమావే శంలో మమత మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకు ంటే తమ ప్రభుత్వం ఎంతమాత్రం అంగీకరించబోదని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయాన్ని అవసరమైతే కోర్టు లో సవాల్ చేస్తామని అన్నారు. అందుకోసం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను సంప్రదించి ఆ దిశగా చర్యలు చేప డుతామని చెప్పారు. అంతేకానీ, రాష్ట్ర అధికా రాల్లో కేంద్రం జోక్యం తగదని మమతా స్పష్టం చేశారు. కేంద్రం ఎలా అధికారంలోకి ఎలా వచ్చిం దో అలాగే తమ రాష్ట్రంలో కూడా మా ప్రభుత్వం అలాగే అధికార ంలోకి వచ్చిందని ఆమె చెప్పారు. కేంద్రం ఉద్దేశపూర్వ కంగానే రాష్ట్ర విష యాల్లో జో క్యం చేసుకునేందుకు యత్నిస్తోందనీ, ఇది అప్ర జాస్వామ్యం, రాజ్యాంగవి రుద్ధం, అనైతికమన్నారు. కేంద్రం ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తే రాష్ట్ర సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేసే ప్రయత్నమే అవుతుందని మమత విమర్శించారు. బిఎస్‌పి చీఫ్ మాయావతి కూడా విరుచుకు పడ్డారు. గోవుల సంరక్షణ పేరుతో దాడులకు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలు కోల్పుతున్నారని ఆమె ఆరో పించారు. సమస్యలను పరిష్క రించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు.