Home తాజా వార్తలు నా భర్తను చంపిన చోటే నన్ను చంపేయండి…

నా భర్తను చంపిన చోటే నన్ను చంపేయండి…

Chennakesavulu-Wife

రంగారెడ్డి: తన భర్తను పోలీసులు అన్యాయంగా ఎన్ కౌంటర్ చేసి చంపేశారని దిశ నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య చెబుతోంది. ఒక్క అమ్మాయి కోసం నలుగురిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దిశ చెల్లెలికి  ఫోన్ చేసే బదులు  పోలీసులకు పోన్ చేస్తే ఈ ఘోరం జరిగేది కాదని పేర్కొంది. ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమె కోర్టు తీర్పు ఇవ్వకముందే పోలీసులు ఇలా చేయడం తప్పని అంటోంది. తన భర్తను చంపిన ప్రదేశంలోనే తనను కూడా చంపేయండని వాపోతోంది. అయితే ఇప్పటికే దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌పై దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా, సోషల్ మీడియా వేదికగా తెలంగాణ పోలీసులపై పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు ప్రశంసలు కురిపించారు.

Chennakesavulu Wife About Disha Final Result