Wednesday, April 24, 2024

నల్గొండ చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

ఉత్సవాలకు సిద్ధ్దమైన చెర్వుగట్టు
నేటి నుంచి ఆరు రోజుల పాటు
జాతర ఉత్సవాలు
జాతర ఏర్పాట్లను పరిశీలించిన
చిరుమర్తి,
కలెక్టర్, ఆర్‌డిఓ
అన్ని శాఖల అధికారులు
పని చేయాలని

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ
ప్రత్యేక ఏర్పాట్లు
తొమ్మిది లక్షల మంది భక్తులు
జాతరకు వస్తారని

మన తెలంగాణ/కట్టంగూర్(నార్కట్ పల్లి) : నల్లగొండ జిల్లాలో ప్రసిద్ధ్ద శైవక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ పా ర్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయం వా ర్షిక బ్రహోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయం శుక్రవారం ( తేదీ19) నుంచి 24 వతేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దేవాలయాలకు, గోపురాలకు రంగులతో పాటు విద్యుత్‌దీపాలతో ఆలయ ప్రాంగణం, కల్యాణ మంటపాలను అందంగా అలంకరించారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక ఏర్పాట్లు

ఆరు రోజుల పాటు జరిగే ఈ జాతర ఉత్సవాలను గతంలో కంటే అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే చి రుమర్తి లింగయ్య ఆదేశాలతో నల్లగొండ ఆర్‌డీఓ జగదీశ్వర్‌రెడ్డి, ఆలయ దేవస్థానం ఇంచార్జీ ఈఓ కె.మహేంద్రకుమార్‌ల అధ్వర్యంలో కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ, భక్తుల రద్దీకి అనుగుణంగా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత, స్వచ్ఛ ఉత్సవాలుగా నిర్వహించేందుకు గాను నిత్యం పారిశుద్ధ్దం, పరిశుభ్రతపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కల్యాణ మండపం చుట్టూ, ఫి న్సింగ్, బారికేడ్ల్ ఏర్పాటు చేశారు. బ్రహోత్సవాల ను విజయవంతం చేసేందుకు చెర్వుగట్టు విశిష్టతను ప్రజలకు తెలియచేసేందుకు ప్రచార రథాలు,ఫెక్సీ బోర్డులు, గోడ పత్రికలు, కరపత్రాల ద్వారా నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర వంటి పరిసర ప్రాంత జిల్లాల్లో ప్రచారం నిర్వహించారు. ఆరు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సుమారు 9 లక్ష మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

కోవిడ్ 19 దృష్టా ఆరోగ్య సిబ్బంది అత్యవసరమైన మందులతో నిత్యం భక్తులకు అం ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అంటువ్యాధులు, ఇతర వ్యా సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. పరిస్థితుల కోసం 104, 108 వాహనాలను అందుబాటులో ఉంచారు. పార్కింగ్ స్థలాలు, జనపంచార కూడళ్లలో పబ్లిక్ టాయిలెట్‌లను అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా నిరంతరం పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు చేపట్టారు.జాతర కు వచ్చే భక్తుల సౌకర్యార్ధం జిల్లా నలుమూలల నుండే కా కుండా, ఇతర ప్రాంతాల నుంచి జాతర కు వచ్చే భ క్తుల కోసం ఆర్టీసి అధికారులు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నారు. అదేవిధంగా బ్రహ్మోత్సవాలకు వ చ్చే భక్తుల భద్రత దృష్టా ఎస్పీ, డిఎస్పీ, సీఐ ల ప ర్యవేక్షణలో 1000 మంది పోలీసులు గట్టి బ ందోబస్తు నిర్వహించనున్నారు. భక్తుల భద్రత కోసం సిసి కెమరాలను సైతం ఏర్పాటు చేశారు.

ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు

శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలోని ప్రధాన మండపంలో నేడు(ఈ నెల 19 వ తేదీ న) ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దల సమక్షంలో ఆలయ అర్చకులు రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలను ప్రారంభిస్తారు. 20 వ తేదీన తెల్లవారుజామున కల్యాణ మహా మండప ంలో స్వామి వారి కల్యా ణం, 21వ తేదీన శేషవాహనంపై స్వామి వారి సేవాకార్యక్రమాలు, బలిహరణ, 22వ తేదీ ఉద యం దోపోత్సవం, సా యంత్రం ఏకాంతసేవ, 24 వ తేదీ ఉదయం రుద్రాభిషే కం, సాయంత్రం గజవాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు చెర్వుగట్టు, ఎ ల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.

కొవిడ్ నిబంధనల ప్రకారమే అన్ని ఏర్పాట్లు పూర్తి

శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నేటి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యల సహకారంతో వారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్ మేకల అరుణ రాజిరెడ్డి తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్టా ప్రభుత్వ నిబంధనల ప్రకారం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా త్రాగునీరు, అన్నదానం, బస చేసేందుకు కావాల్సిన చలువ పందిళ్లను, దర్శనాలకు క్యూలైన్‌లు, మోబైల్ టాయిలెట్స్ వంటి ఏర్పాట్లను ధర్మకర్తల పాలకమండలి అధ్వర్యంలో పూర్తి చేశామని ఆమె వెల్లడించారు.
…చెర్వుగట్టు దేవాలయ చైర్మన్ మేకల అరుణ రాజిరెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News