Thursday, April 25, 2024

శివాజీ అంటే పౌరుషం, ఆత్మాభిమానానికి ప్రతీక: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Chhatrapati Shivaji

 

మెదక్: శివాజీ అంటే పౌరుషానికి, ఆత్మాభిమానానికి ప్రతీక అని మంత్రి హరీష్ రావు ప్రశంసించారు.  ఛత్రపతి శివాజీ 390వ జయంతి ఉత్సవాల సందర్భంగా రామాయంపేటలో శివాజీ  విగ్రహాన్ని మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. శివాజీ స్ఫూర్తితో సిఎం కెసిఆర్ పోరాడి తెలంగాణ సాధించారని, రామాయం పేటను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. సిఎ కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకుందామన్నారు. మెదక్, రామాయంపేటకు పరిశ్రమలు రావాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాను లక్ష ఎకరాల మాగాణిగా చేసుకుందామన్నారు. ఛత్రపతి శివాజీ 1630 ఫిబ్రవరి 19న శివ్ నేరి ప్రాంతంలో జన్మించారు. 1680 ఎప్రిల్ 3న రాయ్ గఢ్ పోర్ట్ లో వీరమరణం పొందాడు.

 

Chhatrapati Shivaji is an Indian warrior-king
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News