Home జాతీయ వార్తలు ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు…

Chhattisgarh Maoist encounter Today

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌ జిల్లా హిక్మెట అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు, ఒక జవాను గాయపడినట్లు సమాచారం. డిఆర్‌జి, ఎస్‌టిఎఫ్‌ బలగాలు హిక్మెట్‌ అటవీ ప్రాంతానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో  భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్‌ డిఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Chhattisgarh Maoist encounter Today