Wednesday, April 24, 2024

ఐపిఎస్ ఆఫీసర్ ను దూషించిన కాంగ్రెస్ మహిళా ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

 

రాయ్‌పూర్: కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంఎల్‌ఎ ఓ మహిళా ఐపిఎస్ ఆఫీసర్‌ను దూషించిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కస్డోల్ ప్రాంతంలో జరిగింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదంలో దినసరి కూలీ చనిపోవడంతో పరామర్శించడానికి స్థానిక ఎంఎల్‌ఎ శకుంతల సాహు వచ్చారు.  చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం ఇప్పించాలని సదరు ఎంఎల్ఎ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ధర్నాకు దిగారు. పరిహారం ఇప్పించే ప్రయత్నం చేస్తానని ఐపిఎస్ ఆఫీసర్ అక్కడి వచ్చిన ఎంఎల్‌ఎకు తెలిపింది. మహిళా ఐపిఎస్ ఆఫీసర్ అంకిత శర్మ, సదరు ఎంఎల్‌ఎ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రెచ్చిపోయిన ఎంఎల్‌ఎ ఐపిఎస్‌ అధికారిణిని ఎగతాళి చేసి మాట్లాడడమే కాకుండా దూషించింది. కానీ అప్పటికే ఐపిఎస్ ఆఫీసర్ ఆమెకు గౌరవం ఇచ్చి సర్ది చెప్పటానికి ప్రయత్నించింది. కానీ ఎంఎల్‌ఎ మాత్రం ఐపిఎస్ ఆఫీసర్‌ను అగౌరవపరిచారు. దీంతో నెటిజన్లు ఎంఎల్‌ఎపై మండిపడుతున్నారు. చేతిలో ఉన్న పవర్‌తో ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని కాంగ్రెస్ ఎంఎల్‌ఎకు కుబేర్ రావాల్ అహిరియా అనే నెటిజన్ చురకలంటించారు. ఎంఎల్‌ఎ ప్రవర్తన పిల్లి లాగా ఉందని అరుణ్ త్రిపాఠి అనే నెటిజన్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

Chhattisgarh Woman MLA abuses female IPS officer,scuffle broke out between a female MLA and a female IPS officer in Chhattisgarh’s Kasdol

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News