Home జాతీయ వార్తలు చికెన్, ఎగ్స్ వెజే: రాజ్యసభ ఎంపి

చికెన్, ఎగ్స్ వెజే: రాజ్యసభ ఎంపి

 

ముంబయి: శివ సేన నేత, రాజ్యసభ ఎంపి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చికెన్, ఎగ్స్‌ను వెజ్‌టేరియన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆయుర్వేదిక్ హౌజ్‌లో సంజయ్ మాట్లాడారు. దీనికి నెటిజన్లు ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. మటన్, బీఫ్‌ను వెజ్‌గా మార్చేసి రౌత్ వెజ్‌టేరియన్ అని నామకరణం చేయాలని సూచనలు చేశారు. కోడి మాంసం వెజో… నాన్ వెజో ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీని కోసం ఆయుష్‌కు పది వేల కోట్ల రూపాయలు నిధులు కేటాయించాలన్నారు. నందర్బార్ ప్రాంతంలో గిరిజనులు ఆయుర్వేదిక్ చికెన్ తిని ఆరోగ్యంగా ఉన్నారు. చౌదరీ చరణ్ సింగ్ యూనివర్సిటీలో ఆయుర్వేదిక్ ఎగ్స్ తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. గతంలో ముంబయిలో గోడ కూలి 16 మంది మృతి చెందడంపై సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలో గోడది తప్పు కాదని వర్షాన్నిదే తప్పు అని వ్యాఖ్యలు చేశారు.

 

Chicken And Eggs Should Be Declared Vegetarian: Sanjay