Home తాజా వార్తలు ఆర్‌బిఐ డబ్బులు అక్కర్లేదు

ఆర్‌బిఐ డబ్బులు అక్కర్లేదు

Chidambaram said NDA govt has focused on RBI surplus

3.6 లక్షల కోట్లను కోరడం లేదు

మీడియా కథనాలపై స్పందించిన సుభాష్ గార్గ్   

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) నుంచి రూ.3.6 లక్షల కోట్ల నిల్వలను కోరే ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆర్థిక మూలధన వ్యవస్థను పరిష్కరించడమే ప్రధాన ప్రతిపాదన అని, ఇది చర్చల దశలో ఉందని అన్నారు. ఆర్‌బిఐ, ప్రభు త్వం మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో ఊహాగానాలు, మీడియాలో కథనాలు ఎక్కువయ్యాయి. గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా చే స్తారని, అదేం లేదంటూ వార్తలు వినిపిస్తున్నా యి. తాజాగా ఆర్‌బిఐ నుంచి నిధుల విషయంపై వస్తున్న వార్తలపై ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చింది. ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకోగలమని ప్రభు త్వం విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే మీడియాలో తప్పుడు కథనాలు వెలువడుతున్నాయని గార్గ్ అన్నారు. ప్రభుత్వ గణాంకాలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, ఆర్‌బిఐ నుంచి రూ.3.6 లక్షల కోట్లు నిధులను కోరే ప్రతిపాదనేది లేదని, ఇవన్నీ ఊహాగానాలేనని ఆయన అన్నారు.

ద్రవ్యలోటు లక్షం
ఆర్థిక రోడ్‌మ్యాప్‌పై గార్గ్ స్పందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను 3.3 శాతం ద్రవ్య లోటు లక్ష్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 201314 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు 5.1 శాతంగా ఉందని, 201415 నుంచి ఈ లోటును తగ్గించడంలో ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు. 2018 19 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి దేశీయ ఆర్థిక లోటు 3.3 శాతం పరిధిలోనే ఉంటుందని, వాస్తవానికి ప్రభుత్వానికి ఈ ఏడాది రూ.70 వేల కో ట్ల బడ్జెట్ మార్కెట్ రుణాలు ఉన్నాయన్నారు. ఆర్‌బిఐ ఆర్థిక మూలధన వ్యవస్థ పరిష్కారం దిశగా మాత్రమే చర్చలు ప్రతిపాదనలో ఉన్నాయన్నారు.

ఆర్‌బిఐ డివిడెండ్
రిజర్వు బ్యాంక్‌కు చెందిన రూ. 9.6 లక్షల కోట్ల నిల్వల్లో కనీసం మూడో వంతు నిధులను బదిలీ చేయాలని ప్రభుత్వం కోరుతోందని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే డివిడెండ్‌గా అత్యంత లాభాలతో ఆర్‌బిఐ రావాలని ప్రభు త్వం కోరుకుంటోందని గార్గ్ అన్నారు. మంచి లాభాలను అందించేందుకు ఆర్‌బిఐ బ్యాలెన్స్ షీట్ పటిష్టం కావాలని కేంద్ర భావిస్తోందని అన్నారు. డివిడెండ్లు, మూలధన నిల్వల విషయంలో ఆర్‌బిఐ కొత్త విధానం తీసుకురావాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఓ అధికారి వెల్లడించారు. ఈనెల 19న నిర్వహించనున్న సమావేశంలో ఆర్‌బిఐ బోర్డు పలు కీలక అంశాలపై చర్చించనుంది. వీటిలో మూలధన వ్యవస్థ, ఇతర అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఆర్‌బిఐ రూ.50 వేల కోట్లు డివిడెండ్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. ఆర్థిక రోడ్‌మ్యాప్‌కు కట్టుబడి కేంద్రానికి సహాయంగా ఈ మొత్తాన్ని ఇవ్వాలని భావించింది. జూలైజూన్ ఆర్థిక సం వత్సరాన్ని అనుసరించి గతేడాది(201617) కంటే అధికంగా 63 శాతం డివిడెండ్‌ను ఆర్‌బిఐ చెల్లించిం ది. 2017 18 ఆర్థిక సంవత్సరం జూన్ ము గింపు నాటికి ఆర్‌బిఐ డివిడెండ్‌గా రూ.30, 659 కోట్లు చెల్లించింది. బడ్జెట్ అంచనాల ప్రకారం, ఆర్‌బిఐ నుంచి రూ.54,817 కోట్లు మిగులు లేదా డివిడెండ్‌ను ప్రభుత్వం కోరుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 51,623 కోట్లను పొందింది. 2017 జూన్ 30 ముగింపు నాటి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి డివిడెండ్‌గా ఆర్‌బిఐ రూ.30,659 కోట్ల మిగులును ఇచ్చింది. ఇది గతేడాది(రూ. 65,876 కోట్ల)లో చెల్లించిన మిగులులో సగానికి కంటే తక్కువగా ఉంది.

ఆర్‌బిఐ మిగుళ్లపై సర్కారు కన్ను

దేశం ఆర్థిక విపత్తును ఎదుర్కోనుంది
ప్రభుత్వంపై చిదంబరం విమర్శలు

ఆర్థిక లోటు లక్ష్యాన్ని చేరుకునేందుకే ఎన్‌డిఎ ప్రభుత్వం దృష్టి ఆర్‌బిఐ మిగుళ్లపై పడిందని కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం విమర్శించారు. దీని వల్ల దేశ ఆర్థికంగా తీవ్ర విపత్తును ఎదుర్కోనుందని హెచ్చరించారు. ఎన్‌డిఎ ప్రభుత్వం సెంట్రల్ బ్యాంక్ పాత్రను అర్థం చేసుకోవడంలేదు, అందుకే ఆ సంస్థ గవర్నర్‌కు స్వతంత్రత ఇవ్వకుండా అగౌరవపరుస్తోందని ఇక్కడ గువహటిలో మీడియా సమావేశంలో చిదంబరం అన్నారు. సెక్షన్ 7తో ఆర్‌బిఐకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అధికారం ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇంతకుముందే ఆర్‌బిఐ చట్టం సెక్షన్ 7 వినియోగించిందని అన్నారు. ప్రభుత్వం తక్షణ లక్షం ఆర్‌బిఐ మిగుళ్లపై చేతులు వేయడమని, ద్రవ్య లోటు లక్ష్యాన్ని చేరుకునేందుకు లక్ష కోట్లు సరిపోతాయని, ఎన్నికల అవసరాల కోసం నిధులను పెంచుతోందని ఆయన విమర్శించారు. ప్రస్తుతం ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రణాళిక.. బోర్డు డైరెక్టర్ల ద్వారా ఆర్‌బిఐ గవర్నర్‌పై పెత్తడం చెలాయించడమని దుయ్యబట్టారు. బోర్డు డైరెక్టర్లు ప్రభుత్వానికి చెందినవారేనని, వీరి ద్వారా ఆర్‌బిఐ గవర్నర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చిదంబరం అన్నారు.

Chidambaram said NDA govt has focused on RBI surplus

Telangana Latest News