Home జాతీయ వార్తలు దివాళా బడ్జెట్.. నోట్ల రద్దు భారీ స్కామ్

దివాళా బడ్జెట్.. నోట్ల రద్దు భారీ స్కామ్

బడ్జెట్‌పై చర్చలో సర్కారుపై చిదంబరం దాడి

Chidambaramన్యూఢిల్లీ : నోట్ల రద్దు అత్యంత కిరాతకమైన నిర్ణయం అని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో గురు వారం ఆయన కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ ఆద్యంతం నిరుత్సాహకరంగా ఉందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారీ తప్పిదం అని, దీనితో ఓ వైపు అత్యధిక ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యారని, మరో వైపు అవినీతి, నల్లధనం పగ్గాలు లేకుండా విస్తరించు కుందని తెలిపారు. రాజ్యసభలో బుధవారం ప్రధాని మోడీ చేసిన ప్రసంగం అందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై వాడిన అనుచిత పదజాలం జుగుప్సాకరం అని విమర్శించారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, తరువాతి క్రమంలో అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి వారు కూర్చున్న ప్రధాని పీఠం అనే అంశాన్ని గుర్తుపెట్టుకునైనా మోడీ దుర్భాషలకు దిగకుండా ఉంటే బాగుండేదని హితవు పలికారు. 2017-18 బడ్జెట్‌పై చర్చను చిదంబరం సభలో ప్రారంభించారు. అత్యంత భయానకమైన నిర్ణయం తరువా త వెలువడ్డ కేంద్ర బడ్జెట్ అందుకు తగ్గట్లుగానే చతికిల పడిందని మాజీ మంత్రి విమర్శించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయోమయంలో కూరుకుపోయినట్లుగా ఉంద ని, రోజుకే కొత్త వివరణలు వెతుక్కొంటోందని చిదంబరం వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు తరువాత కొత్త రెండు వేల నోటు చలామణిలోకి వచ్చిన నాలుగురోజులకు తొలి సారిగా తనకు ఓ నోటు దక్కిందని, అయితే కోట్లాది రూపాయల విలువైన కొత్త నోట్లు కొందరి వద్ద ఉండగా పట్టుకున్నారని, 2016లో జరిగిన అతి భారీ స్కామ్ ఇదేన ని, ఆర్‌బిఐ ముద్రణాలయం నుంచే వారికి అంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లు వచ్చి చేరాయా? అని ప్రశ్నించారు. దీని వల్ల పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం మరింతగా పెరిగిం దని, ముడుపుల పర్వం ఇనుమడించినట్లు వెల్లడయిందని చిదంబరం తెలిపారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది ఎనిమిదివారాల పాటు పెద్ద నోట్ల రద్దు దెబ్బకు గురయ్యా రని చెప్పారు. బడ్జెట్ నిరాశజనకంగా ఉందని జిడిపి పతనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కీలక రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు తగ్గాయని విమర్శిం చారు. కేంద్రం రక్షణ పరిశోధన నుంచి డబ్బును ఉపసం హరించి రక్షణ పెట్టుబడులకు మళ్లించారని తెలిపారు. సవరించిన అంచనాల మొత్తం రూ.71,000 కోట్లకు చేరిందని దీనిని బట్టి చూస్తే ప్రభుత్వం డబ్బు వ్యయం చేయలేకపోతున్నట్లు కానీ, లేదా వ్యయానికి సరైన డబ్బు లేనట్లుగా కానీ తేలుతోందని చిదంబరం వ్యాఖ్యానించారు. బిజెపి అనుబంధమైన భారతీయ మజ్దూర్ సంఘ్ చెపుతున్న గణాంకాల మేరకే చూస్తే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 75 శాతం వరకూ మూతపడ్డాయని చిదంబరం తెలిపారు. ఈ బడ్జెట్‌లో ఒక్కటంటే ఒక్కటైనా ఉద్యోగకల్పన మార్గం ఉందని చెప్పగలరా? అని బిజెపి వారిని చిదంబరం సభలో నిలదీశారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో దిగులు పట్టుకుందని, కొందరు జీన్స్ నిషేధం అంటున్నారు, మరికొందరు పుస్త కాలు, రచయితలను వెలివేయాలంటున్నారు, బీఫ్ వద్దం టున్నారు, అయితే తాము కోరుకునేది ఒక్కటేనని విద్యా వంతులకు, చదువుకోని వారికి కూడా ఉపాధి, ఉద్యోగావ కశాలు కల్పించాల్సి ఉందనేది తమ డిమాండ్ అన్నారు.
పేదల బడ్జెట్ : బిజెపి సభ్యుడి సమర్థన
బడ్జెట్‌లో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని పేదలు, రైతులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చర్యలు తీసుకు న్నారని బిజెపి సభ్యులు ప్రభాత్ జా తెలిపారు. పెద్ద నోట్ల రద్దు పేరిట ప్రతిపక్షాలు బడ్జెట్‌పై బురద చల్లరాదని ఆగ్ర హం వ్యక్తం చేశారు. అయినా పెద్ద నోట్ల రద్దు సరైన చర్య అని ప్రజానీకంలో అత్యధికులు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. తాత్కాలికంగా క్యూలలో బాధలు పడ్డా, శాశ్వా త రీతిలో దేశ భవిష్యత్తు ఉజ్వలం అవుతుందని నిర్థారించు కున్నారని చెప్పారు. బడ్జెట్ కేవలం పదాడంబరం తప్ప వేరే ఏదీ లేదని, ఆర్థిక పరిస్థితి అంతా బాగుందన్నారు.