Home తాజా వార్తలు రాజ్‌భవన్‌ చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌

రాజ్‌భవన్‌ చేరుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌

Chief Minister KCR reached Raj Bhavan

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం రాజ్ భవన్ కు వెళ్లారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌తో సిఎం భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో కలిసి కెసిఆర్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్.వి రమణకు స్వాగతం పలకనున్నారు. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో బసచేయనున్నారు. తిరుపతి నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన జస్టిస్‌గా ఎన్.వి రమణ మంత్రులు, ఎంఎల్ఎలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌ చేరుకుంటారు. కుటుంబసభ్యులతో రాజ్‌భవన్‌లోనే బసచేయనున్నారు.

Chief Minister KCR reached Raj Bhavan