Home తాజా వార్తలు జిల్లా కలెక్టర్‌ను అభినందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

జిల్లా కలెక్టర్‌ను అభినందించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

Chief secretary

 

పెద్దపల్లి : కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2019లో కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలను మెరుగ్గా అమలు చేసి పెద్దపల్లి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి సర్వోత్తమ జిల్లాగా జాతీయ అవార్డ్ పొందినందుకు జిల్లా కలెక్టర్ శ్రీదేవసేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కె. జోషి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవనంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే. జోషిని మర్యాదపూర్వకంగా కలిశారు.

మహాత్మాగాంధీ 150వ జయంతిన గుజరాత్‌లోని ఆహ్మదాబాద్‌లో సబర్మతి నది ప్రంట్ సమీపంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ దివాస్ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవార్డును జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన స్వీకరించారు. ఈ సందర్బంగా స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామంలో పెద్దపల్లి సర్వోత్త మ జిల్లాగా ఎంపిక కావడంతో జిల్లా బాధ్యత మరింత పెరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు.

Chief secretary who congratulated District Collector