Home తాజా వార్తలు ఇప్పట్లో ధోనీ రిటైర్‌ అవ్వడు: ఎమ్మెస్కే

ఇప్పట్లో ధోనీ రిటైర్‌ అవ్వడు: ఎమ్మెస్కే

ముంబయి: ప్రపంచకప్ అనంతరం టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడంటూ పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ధోనీ 2 నెలలు విశ్రాంతి తీసుకోవడంతో విండీస్‌లో పర్యటించనున్న భారత జట్టులో చోటు దక్కలేదు. ఆదివారం చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్టర్లు విండీస్ టూర్ కు మూడు ఫార్మాట్లలో టీమిండియా జట్టును ప్రకటించారు. ఈ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్ వార్తలపై ఎమ్మెస్కే ప్రసాద్ ను మీడియా ప్రశ్నించింది.

దీనిపై ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘రిటైర్మెంట్‌ విషయం అనేది పూర్తిగా ఆటగాడి వ్యక్తిగతం. ఎప్పుడు రిటైర్‌ అవ్వాలనే విషయం ధోనీకి తెలుసు. ఇప్పట్లో మాత్రం రిటైర్‌ అవ్వడు. విండీస్‌ పర్యటనకు అందుబాటులో ఉండనని ధోనీనే స్వయంగా తెలిపాడు. పారామిలటరీ రెజిమెంట్‌లో పని చేయాలని ఆలోచనతో రెండు నెలల పాటు జట్టుకు దూరంగా ఉంటాడు. కానీ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమతూకంతో కూడిన జట్టును ఎంపిక చేయడమే ప్రస్తుతం సెలక్టర్ల పని. సెప్టెంబరు 15 నుంచి దక్షిణాఫ్రికాతో సిరీస్ ఉన్న నేపథ్యంలో ధోనీ భవితవ్యం ఏంటనేది ఆ సిరీస్‌కు ముందు వెల్లడయ్యే అవకాశం ఉంది. విండీస్‌ పర్యటనలో మూడు ఫార్మాట్‌లలో రిషబ్‌ పంతే వికెట్‌కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. దీంతో అతనిపై ఎక్కువ పనిభారం పడకుండా చూడాలి. అదేవిధంగా భవిష్యత్‌ అంతా యువ ఆటగాళ్లదే. ఇప్పటి నుంచే వారికి క్రమం తప్పకుండా అవకాశాలు కల్పిస్తూ.. వారేపైనే ఎక్కువ దృష్టి పెడుతాం.’ అని ఎమ్మెస్కే వివరించాడు.

Chief selector MSK Response on MS Dhoni retirement