Home జగిత్యాల మల్లిఖార్జున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన చీఫ్‌విప్

మల్లిఖార్జున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన చీఫ్‌విప్

vp

జగిత్యాల: గొల్లపల్లి మండలం మల్ల న్నపేట శ్రీ మల్లిఖార్జున స్వామి షష్టి ఏడువారాల జాతరలో భాగంగా బుధవారం ప్రభుత్వం చీఫ్ విప్ కొప్పు ల ఈశ్వర్ దంపతులు స్వామి వారిని దర్శించుకొని పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు పూ ర్ణకుంభ స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి పేరిట ఈశ్వర్ నిలువెత్తు బంగారాన్ని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ ఈశ్వర్ సతీమణి స్నేహలత, జెడ్పీటీసీ గొస్కుల శై లజజలేందర్, ఎంపిటిసిలు భీమ సత్తయ్య, గంగారెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు లింగారెడ్డితో పాటు సర్పంచ్ లు, కార్యకర్తలు పాల్గొన్నారు.