Saturday, April 20, 2024

బాలిక ట్వీట్‌కు తక్షణం స్పందించిన మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ktr

హైదరాబాద్: ప్రజాసమస్యలకు తక్షణం స్పందించే మంత్రి కెటిఆర్ సోషల్‌మీడియాలో వచ్చిన సమస్యలకుకూడా వేగంగా స్పందిస్తూ తక్షణ పరిష్కారం కోసం కృషి చేసస్తారు అనడానికి ఈ ట్విట్ ఉదాహరణ. అంకుల్ గత ఐదురోజుల నుంచి నీళ్లురావడంలేదు అంటూ రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ దేవినగర్ నుంచి గాయత్రి అనే బాలిక కెటిఆర్‌కు ట్విట్ చేశారు. తక్షణం స్పందించిన కెటిఆర్ సమస్యను పరిష్కరించాలని అధికారులను రాత్రికి రాత్రే ఆదేశించారు.

గాయత్రి చేసిన ట్విట్టర్‌లో ఇలా ఉంది. అంకుల్ ఎలా ఉన్నారు. నాపేరు గాయత్రి, నేను సికింద్రాబాద్ దేవి నగర్‌లో ఉంటాను. మాకు వాటర్ వచ్చి ఐదు రోజులు అవుతుంది. గిన్నెలు తోముకోవడానికి, దుస్తులు ఉతకడానికి, స్నానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మా సమస్యను సీరియస్‌గా తీసుకుని మాకు క్రమంగా వాటర్ వచ్చేవిధంగా చూడాలని కోరారు. అలాగే కెసిఆర్ తాతకు కూడా చెప్పగలరు ప్లీజ్ అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

ఈ ట్విట్టర్‌కు రాత్రి 12 గంటలకు కెటిఆర్ స్పందిచారు. వాటర్‌బోర్డు చర్యలు తీసుకుంటుందని, స్థానిక జనరల్ మేనేజర్ వెంటనే సందర్శించి సమస్యను పరిష్కరించాలని ట్విట్టర్‌వేదికగా కెటిఆర్ ఆదేశించారు. దీంతో అధికారులు అప్రమత్తమై దేవినగర్‌లోని బాలిక ఇంటికి చేరుకునినీటి సరఫరా చేశారు.ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Child complains about water supply KTR responds

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News