Home జోగులాంబ గద్వాల్ వేడి సాంబారులో పడి చిన్నారి మృతి

వేడి సాంబారులో పడి చిన్నారి మృతి

Child death

 

జోగులాంబ గద్వాల : జిల్లాలోని గట్టు మండలం మానోపాడు గురుకుల పాఠశాలలో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న వరలక్ష్మి కుమార్తె షర్మిల(2) గురువారం వేడి సాంబారులో పడి మృతి చెందింది. తల్లి వరలక్ష్మి వంటగదిలో పనిలో ఉండగా షర్మిల ఆడుకుంటూ వెళ్లి సాంబారు పాత్రలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన వంట సిబ్బంది షర్మిలను బయటకి తీసి కర్నూలుకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షర్మిల మృతి చెందింది. ఈ ఘటనతో గట్టులో విషాదఛాయలు అలుముకున్నాయి.

Child death in Jogulamba gadwal