Thursday, April 25, 2024

కలుషిత నీరు తాగి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

Child dies after drinking contaminated water

 

కుటుంబంలో 11 మందికి అస్వస్థత
కామారెడ్డి జిల్లా మర్లకుంట తాండాలో ఘటన

మన తెలంగాణ/గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వెనుక తాండా గ్రామ పరిధిలోని మర్లకుంట తాండాలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారు తాగిన మంచినీటితోనే అనారోగ్య బారినపడ్డట్టు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రమావత్ మేగ్యా, చిలుకాబాయి కుటుంబ సభ్యులు శుక్రవారం తమ పంట చేనులో మధ్యాహ్నం భోజనం చేసి చేనులోని బోరునీరు తాగారు. అనంతరం వారు పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నుంచి వాంతులు, విరోచనాలు కావడంతో వారు గాంధారి మండల కేంద్రంలోని ప్రైవేస్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.

మరుసటి రోజు విరోచనాలు తగ్గకపోవడంతో వారు కామారెడ్డి ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకుంటున్న సమయంలో శనివారం రాత్రి చిన్నారి శ్రీనిధి (09) ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. బాధితుల్లో 10 నెలల బాలుడు శ్రీకాంత్ ఐసియూలో చికిత్స పొందుతున్నాడు. బాధితులు సేవించిన మంచినీరు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపినట్లు ఆర్‌డబ్లుఎస్ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యులను గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, టిఆర్‌ఎస్ నాయకులు బలరాం, మాజీ ఎంపిటిసి శంకర్ పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News