Wednesday, April 24, 2024

నిందితుడి ‘స్పర్శ’ ఉద్దేశం బాలికకు తెలుసు

- Advertisement -
- Advertisement -

Child knows good touch, bad touch, says POCSO court

 

బెయిల్ నిరాకరిస్తూ కోర్టు ఉత్తర్వులు

ముంబయి: ఒక ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ప్రత్యేక పోక్సో కోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. బాధితురాలు బాలిక అయినప్పటికీ మంచి స్పర్శ లేదా చెడు స్పర్శ ఏమిటో ఆమెకు తెలియదని భావించలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 6న కోర్టు ఈ ఉత్తర్వులు జారీచేసినప్పటికీ దాని ప్రతి మంగళవారం నాడు అందుబాటులోకి వచ్చింది.

నిందితుడి బెయిల్ పిటిషన్‌ను ప్రత్యేక న్యాయమూర్తి భారతి కలే తిరస్కరిస్తూ నిందితుడు తనను తాకాడని, అది చెడ్డ స్పర్శగా తాను భావించానని ఆ బాలిక విస్పష్టంగా తనకు తెలిపిందని చెప్పారు. బాధితురాలి ఇంటి పక్కనే ఉంటున్న నిందితుడు ఆడుకోవడానికి వచ్చిన ఆ బాలికను తగలరాని ప్రదేశాల్లో తాకాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఐపిసిలోని 354 సెక్షన్‌తోపాటు పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా..బాధితురాలిగా చెబుతున్న బాలిక నిందితుడి ఇంటికి తరచు వెళ్లేదని, ఆ బాలికను తాకడాన్ని చెడు స్పర్శగా చెప్పడం తగదని అతని తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే, నిందితుడికి తన స్పర్శ ఉద్దేశం తెలుసునని, ఆ విషయాన్ని అతను తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నాడని ప్రాసిక్యూషన్ న్యాయవాది వాదించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News