Home ఆఫ్ బీట్ తేడాలను తెలియజెప్పండి…!

తేడాలను తెలియజెప్పండి…!

Children

 

అంతస్తుల్లో తారతమ్యాలు సహజం. వాటి ఆధారంగా సఖ్యతల్లో హెచ్చుతగ్గులు పాటించటం తగదనే విషయం పిల్లలకు నేర్పాలి. లేకుంటే భవిష్యత్తులో బాధితులు మీరే కావచ్చు. కాబట్టి, చిన్న వయసు నుంచే పిల్లలు ఈ కింది వ్యవహారశైలిని అలవరుచుకునే చిట్కాలు పాటించండి. దుస్తులు, చెప్పులు, వాహనాలను బట్టి ఇచ్చే గౌరవంతో హెచ్చుతగ్గులు పాటించకూడదని పిల్లలకు నేర్పాలి.

* పేదరికం సామాజిక అంశమని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆయాలు, పనివాళ్ల పిల్లలతో కలిసి ఆడుకునేలా ప్రోత్సహించాలే తప్ప… ‘ఛీ.. వాళ్లకు దూరంగా ఉండు, వాళ్లతో మనం కలవకూడదు’ లాంటి మాటలు పిల్లలతో మాట్లాడకూడదు. గేలి చేయటం, నవ్వుకోవటం మొదలైన అలవాట్లను మొగ్గలోనే తుంచేయాలి. సమాజంలో వర్గాలు, తరగతులు గురించి క్లుప్లంగా పిల్లలకు వివరించి పేదరికం మీద అవగాహన పెంచాలి.

Children should be free of Discrimination