Home దునియా లెక్కలు బాగా రావడానికి..

లెక్కలు బాగా రావడానికి..

Maths

 

చిన్నారుల మేథస్సు మరింత పెరగాలంటే… వారికి చేతి వేళ్లపై లెక్కపెట్టడం అలవాటు చేయమంటున్నారు పరిశోధకులు. ఇలా చే సే పిల్లలు గణితంలో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నట్లు తాజా అధ్యయనం చెబుతోంది. అమెరికాలోని యూనివర్శిటీ పరిశోధకు లు దీన్ని నిర్వహించారు. ఎనిమిది నుంచి 13ఏళ్ల వయస్సున్న 39 మంది పిల్లలపై దీర్ఘకాలం పాటు అధ్యయనం చేశారు. చిన్నారులు వేళ్లను ఉపయోగించి తీసివేతలు, గుణకారాలు చేస్తున్న సమయం లో వారి మెదడులోని మార్పులను పరిశోధకులు విశ్లేషించారు. ఒత్తిడి, నొప్పి, కదలికల నియంత్రణకు కారణమయ్యే మెదడులోని భాగాలు వేళ్లతో లెక్కలు చేసేటప్పుడు మరింత క్రియాశీలంగా పని చేస్తున్నట్లు గుర్తించారు. అయితే కొన్ని లెక్కలు చేసే సమయంలో ఈ తరహా స్పందనలు మెదడులో కనిపించలేదని పరిశోధకులు అంటున్నారు. ఏది ఏమైనా పిల్లలు లెక్కలు చేసే సమయంలో చేతివేళ్లను ఉపయోగించడమనేది అన్ని విధాల ఆరోగ్యకరమైన విషయమని వారు స్పష్టం చేస్తున్నారు.

 

Childrens Active in Maths with Finger Movement