Thursday, April 25, 2024

చైనా చొరబాటు నిజమేనట!

- Advertisement -
- Advertisement -

China Army enter into India in May says Rahul Gandhi

న్యూఢిల్లీ: దేశ రక్షణ మంత్రిత్వశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి ఓ కీలక పత్రం గల్లంతు అయింది. ఈ విషయాన్ని ఇప్పుడు రక్షణ మంత్రిత్వశాఖ రెండు రోజుల తరువాత అవునని ధృవీకరించింది. మే నెల మొదట్లో తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో చైనా సైనిక బలగాలు భారతీయ భూభాగంలోకి చొరబడ్డాయని వెబ్‌సైట్‌లో పొందుపర్చిన డాక్యుమెంట్ ఇప్పుడు కన్పించడం లేదు. ఈ వెబ్‌సైట్‌లోని న్యూస్‌సెక్షన్‌లోని ఈ డాక్యుమెంట్ మంగళవారం నుంచి లేకుండా పోయిందని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ కీలక పేజీలో ఈ వివరాలు పొందుపర్చి ఉంచారు. అందులో ఈ విధంగా ఉంది ‘వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వెంబడి ఇటీవలి కాలంలో చైనా అతిక్రమణలు, ఆక్రమణలు పెరుగుతూ పోతున్నాయి. మే 5వ తేదీన గల్వాన్ వ్యాలీలో జరిగిన సంఘటనల దరిమిలా వారి చర్యలు శృతిమించాయని చెప్పాల్సి ఉంటుంది. చైనా పక్షం మే 1718 తేదీలలో పాంగాంగ్ లేక్ ఉత్తర ఒడ్డున, కంగ్రాంగ్ నాలా, గోగ్రాల వద్ద భారతీయ భూభాగంలోకి దూసుకువచ్చింది.’ అని మంత్రిత్వశాఖ ఈ డాక్యుమెంట్‌లో పేర్కొంది. దీనికి ఎల్‌ఎసి వెంబడి చైనా అతిక్రమణ చర్యలు అనే శీర్షిక పెట్టింది. దీనిని వెబ్‌సైట్‌లో వాటీజ్ న్యూ అనే సెక్షన్‌లో పొందుపర్చింది. చైనా అతిక్రమణ గురించి ఇందులో పేర్కొనడం అత్యంత కీలకంగా మా రింది. అయితే ఇప్పుడీ పేజీ కన్పించకుండా పోవడం మరింత సంచలనానికి దారితీసింది.

జూన్ 6వ తేదీన కార్ప్ కమాండర్ల స్థాయి ఫ్లాగ్‌మీటింగ్ జరిగింది. అయితే తరువాత జూన్ 15వ తేదీన రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇరుపక్షాల సైనికులకు ప్రాణనష్టం జరిగిందని డాక్యుమెంట్‌లో తెలిపారు. తరువాతి దశలో రెండోసారి కూడా ఈ ప్రాంతపు సైనికాధికారుల స్థాయి సమావేశం జూన్ 22వ తేదీన జరిగింది. ఇప్పటికీ పలు స్థాయిల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ సరిహద్దులలో ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉందని ఈ పత్రంలో తెలిపారు. అయితే వెబ్‌సైట్‌లో నుం చి ఈ డాక్యుమెంట్ కన్పించకుండా పోయిందని, గురువారం ఉదయం ఈ విషయాన్ని గుర్తించామని, సంబంధిత లింక్ తెగిందని రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి తెలిపారు. భారత రక్షణ మంత్రిత్వశాఖ అధికారికంగా ఈ విధంగా వెబ్‌సైట్‌లో తెలియచేయడం ఇదే తొలిసారి. ఎల్‌ఎసి వెం బడి మే నెలలో ఉద్రిక్తతలు నెలకొన్న నాటి నుంచి తరువాత జూన్ 15న ఇరుపక్షాల సైనికుల మధ్య బాహాబాహీ జరిగి భారత్‌కు చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు 20 మంది జవాన్లు అమరులైన నాటివరకూ కూడా ఎక్కడ కూడా చైనా మన సరిహద్దులను అతిక్రమించినట్లు అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

రాహుల్ చెప్పిందీ అతిక్రమణ క్రమమే
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చైనా చర్యల తరువాతి క్రమంలో పలుమార్లు చైనా మన భూభాగంలోకి చొరబడిందని, మన సైనికులకు సరైన సాధనాసంపత్తి లేకపోవడం వల్లనే వారు బలయ్యారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తూ వస్తున్నారు. దీనిని రక్షణ మంత్రి, ప్రధాని, బిజెపి నేతలు ఖండిస్తూ వచ్చారు. మరి అతిక్రమణ అంశాన్ని అధికారిక వెబ్‌సైట్ అంగీకరించిడం ఎవరి వాదనను బలపరుస్తోందనే ప్రశ్న తలెత్తిన దశలోనే ఈ డాక్యుమెంట్ అదృశ్యం ఎవరి పని అనే మీమాంస నెలకొంది. దీనిని ఒత్తిళ్లతో తొలిగించారా? లేక అదృశ్యం అయిందా? అనే అంశంపై రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధులు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. దీనిని సైట్ నుంచి తొలిగించినట్లు తమకు సమాచారం లేదన్నారు.

China Army enter into India in May says Rahul Gandhiమే నెలలోనే భారత్‌లోకి చైనా ఆర్మీ: రాహుల్ గాంధీ

సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న పరిస్థితుల గురించి ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మే నెలలో తూర్పు లడఖ్ ప్రాంతంలోకి చైనా ఆర్మీ ప్రవేశించినట్లు తెలుపుతూ వచ్చిన ఓ వార్తను రాహుల్ గాంధీ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జూన్ 15వ తేదీ గల్వాన్ లోయ వద్ద చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణ కంటే నెల రోజుల ముందే చైనా ఆర్మీ భారత్‌లో ప్రవేశించిందని మండిపడ్డారు. లద్దాఖ్ వద్ద భారత భూభాగాన్ని చైనా దళాలు మేలోనే ఆక్రమించాయని రక్షణ శాఖ ఒక రిపోర్టులో పేర్కొంది. ఈ విషయాన్ని ఒక జాతీయ మీడియా తన పత్రికలో ప్రచురించింది. అయితే వాస్తవాధీన రేఖ వద్ద భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయని భారత రక్షణశాఖ మాత్రం ఆ నిజాన్ని దాచి పెట్టిందని రాహుల్ చెప్పారు. కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్‌గంగ్ సో ప్రాంతాల్లోకి మే నెల 17, 18వ తేదీల్లో చైనా ఆర్మీ వచ్చినట్లు రక్షణ శాఖ తెలిపిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు అసత్యాలు చెబుతునారని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా- భారత్ మధ్య జరిగిన ఘర్షణలలో 20 మందికి పైగా భారత్ సైనికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.

China Army enter into India in May says Rahul Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News