Friday, April 26, 2024

భారతే అక్రమంగా చొరబడింది: చైనా

- Advertisement -
- Advertisement -

బీజింగ్: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఈ నెల 9న భారత దళాలతో జరిగిన ఘర్షణపై చైనా విదేశా వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. భారతే అక్రమంగా సరిహద్దు దాటి చైనా బలగాలను అడ్డుకుందని ఆరోపించింది. ఎఎఫ్‌పి వార్తా సంస్థ ఈ విషయం తెలియజేసింది. సరిహద్దుల్లో పరిస్థితి స్థిరంగా ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ప్రకటించిన కొద్ది గంటలకే ఈ ప్రకటన చేయడం గమనార్హం. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్ మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘నాకు తెలిసినంతవరకు భారత్‌-చైనా సరిహద్దులో పరిస్థితి స్థిరంగా ఉంది. ఇరుపక్షాలు దౌత్య, సైనిక మార్గాల్లో నిరంతరాయంగా చర్చలు కొనసాగిస్తున్నాయి. చైనా, భారత్‌లు ఈ దిశగా ముందడుగు వేస్తాయని ఆశిస్తున్నా’ అని వెల్లడించారు.

ఏకాభిప్రాయాలకు వచ్చిన అంశాలను ఇరుపక్షాలుపాటించాలని, ఒప్పందాలను కఠినంగా పాటించాలని చైనా కోరుకుంటోందని ఆయన చెప్పారు. అయితే తవాంగ్ ఘరషణకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పటేదు. మీరు అడిగిన నిర్దిష్ట ప్రశ్నలను సంబంధిత అధికారులను సంప్రదించాలని కోరుతున్నా’ అని మాత్రమే ఆయన చెప్పారు. అయితే భారత, చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణపై వివరణ ఇవ్వాలని ఆ దేశ రక్షణ శాఖను ఓ విదేశీ వార్తాసంస్థ కోరగా.. ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News