Home తాజా వార్తలు 27 ఏళ్ల కనిష్టానికి చైనా జిడిపి

27 ఏళ్ల కనిష్టానికి చైనా జిడిపి

China GDP

 

న్యూఢిల్లీ: అమెరికాతో తలెత్తిన వాణిజ్య వివాదాలతో దేశీయంగా, విదేశీ పరంగా డిమాండ్ క్షీణించడంతో చైనా ఆర్థిక వృద్ధి 27 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో చైనా ఆర్థిక వృద్ధి 6.2 శాతానికి నెమ్మదించింది. చైనా ఆర్థిక వ్యవస్థ 1992 తర్వాత అతితక్కువ వృద్ధిరేటును నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో నమోదు చేసిన 6.4 శాతం కంటే ఇది 0.2 శాతం తక్కువ, అలాగే గత ఏడాది ఇదే సమయంలో 6.3 శాతంగా ఉంది. ప్రధానంగా అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్షీణించడం చైనాను దెబ్బతీసిందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు చైనా ఇప్పటికే వడ్డీరేట్లను తగ్గించి రుణ లభ్యతను పెంచింది. దీంతో జూన్‌లో కొంత పెట్టుబడులు పెరిగాయి.

అయితే గత ఏడాదితో పోలిస్తే జూన్‌లో ఎగుమతులు పడిపోయాయి. అమెరికాతో వాణిజ్య చర్చలు విఫలం కావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే చైనా దేశీయ కంపెనీలకు 291 బిలియన్ల మేరకు పన్ను రాయితీలు, ఫీజుల తగ్గింపును అందించింది. ఈ త్రైమాసికంలో వాణిజ్య చర్చల్లో నెలకొన్న పరిస్థితితో చైనా కంపెనీల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సుమారు 360 బిలియన్ డాలర్ల వాణిజ్యంపై విధించుకున్న సుంకాల వలన ఇరుదేశాల తయారీ రంగాలు కుదేలయ్యాయి. ఈ ఏడాది మొదటి అర్థభాగంలో అమెరికాకు చైనా ఎగుమతులు 8 శాతానికి పైగా పడిపోయాయి. చైనా జిడిపి వృద్ధిరేటును 6 నుంచి -6.5శాతం మధ్య నమోదు చేయించడానికి ఈ సారి వడ్డీరేట్లను మరింత తగ్గించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

China GDP growth slows to 27 year low