Home అంతర్జాతీయ వార్తలు చైనా రక్షణ బడ్జెట్ 179 బిలియన్ డాలర్లు

చైనా రక్షణ బడ్జెట్ 179 బిలియన్ డాలర్లు

China hikes defence budget to USD 179 billion

 

బీజింగ్: చైనా తన రక్షణ బడ్జెట్‌ను ఇప్పుడు 179 బిలియన్ డాలర్లుగా ఖరారు చేసింది. అమెరికా తరువాత అతి పెద్ద సైనిక రక్షణ వ్యయ దేశంగా చైనా స్థానం దక్కించుకుంది. గత ఏడాది రక్షణ బడ్జెట్ 177.6 బిలియన్లుగా ఉంది. దీనిని ఇప్పుడు 179 బిలియను డాలర్లుగా పెంచారు. భారతదేశ రక్షణ కేటాయింపులతో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ.

గత ఏడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలోనే చైనా రక్షణ బడ్జెట్ పెరిగింది. కరోనా వైరస్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ ప్రభావంతోనే ఈ పరిణామం చోటుచేసుకుందని అధికారిక మీడియాలే విశ్లేషించాయి. ప్రపంచంలో చైనాకే అత్యధిక సంఖ్యలో సైనిక బలం ఉంది. 20 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఇకపై కూడా మొత్తం మీద రక్షణ బడ్జెట్‌లో 6.6 శాతం మేర తగ్గింపు తప్పదని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్‌పిసి)కు సమర్పించిన ముసాయిదా బడ్జెట్ ప్రతిపాదనలో తెలిపారు.

China hikes defence budget to USD 179 billion