Home ఎడిటోరియల్ చైనా ఒక్కటే అడ్డు కాదు

చైనా ఒక్కటే అడ్డు కాదు

ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వ సమస్యను విశాల దృష్టితో చూడాలి …

NST

అణు ఇంధన పరికరాల సరఫరా దేశాల బృందం (ఎన్‌ఎస్‌జి) లోకి ప్రవేశించాలని దరఖాస్తు చేసుకొన్న భారత్ చైనాతో సంబంధాల్లో కేవలం ఆ అంశానికే ప్రాముఖ్యతను ఇస్తోంది. ఆ దేశంపట్ల అసమ్మతిని, అసంతృప్తిని ఈ అంశంలో భారత్ పెంచుకుంది. కేవలం తన ఏకపక్ష వాదననే ప్రపంచం వినాలని అది కోరుకుంటోంది. భారత్ వాదన భావోద్వేగాలపై ఆధారపడిందే తప్ప వ్యూహాత్మక మైనదిగాని, వాస్తవ దృష్టితో కూడినదిగాని కాదు.
అసలు ఎన్‌ఎస్‌జి సభ్యత్వాన్ని భారత్ ఎందుకు కోరుకుం టోంది? దీనికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానం ఏమి టంటే – అణు ఇంధన రంగంలో ఎన్‌ఎస్‌జి దేశాలతో ప్రస్తుత సహకా రం పెంపొందడానికి, ఆధునిక పరికరాలు దిగుమతి చేసుకో వడానికి, పారిశ్రామిక సహకార ఒప్పందాలు కుదుర్చ్టుకోవడానికి అది అవసరమని ఆ మంత్రిత్వ శాఖ అంటోంది. అంతేకాక దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థం పెంచడానికి కావలసిన సాంకేతిక విజ్ఞానం ఎన్‌ఎస్‌జి సభ్యత్వంవల్ల అందుబాటులోకి వస్తుందని కూడా వివరించింది. ఎన్‌ఎస్‌జికి, భారత్‌కు మధ్య అడ్డుగోడగా నిలిచినది చైనా ఒక్కటే అనే అభిప్రాయం భారత ప్రజల్లో బలంగా నాటుకు పోయింది.ఎంతగా అంటే – ఈ అంశంలో భారత ప్రభుత్వం చేయ గలిగింది ఏమీ లేదన్నంతగా. తాము విఫలం చెందినట్లు భారత ప్రభుత్వం ఒప్పేసుకున్నట్లుగా. బాధ్యతాయుతమైన అణ్వాయుధ దేశంగా భారత్‌కు గల అంతర్జాతీయ ప్రాధాన్యతను గుర్తించకపోతే చైనాకే నష్టం అని వారంటున్నారు. పాక్ వ్యతిరేకినన్న కారణం మీద తన దరఖాస్తును చైనా అడ్డుకొంటున్నట్లు భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఎస్‌జి సభ్యత్వం అంశంలో చైనాను ఆడిపోసు కోవడమే భారత్ వ్యూహంగా కనిపిస్తోంది.

ఒక్క చైనాయే అడ్డుగోడా?
ఈ అంశంలో ఒక్క చైనాను నిందిస్తూ పోవడం భారత ప్రభుత్వం తెలివి తక్కువ తనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. చాలా మంది భారతీయ విశ్లేషకులు కూడా అదే పంథా అవలంబించడం సమంజసం కాదు. కొన్ని నెలల క్రితం సియోల్‌లో జరిగిన ఎన్‌ఎస్‌జి విస్తృత సమావేశానికి ముందు పార్లమెంట్‌లో విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి సింగ్ మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌జిలో ప్రవేశానికి భారత్ కృషిని వివరించారు. దేశానికి గల అంతర్జాతీయ మద్దతు గురించి వివరిస్తూ ‘లెక్కలేనన్ని దేశాలు’ వంటి పదాలు ప్రయోగించారు. ‘ఒక్క దేశం తప్ప’ అనబోయి అన్ని దేశాలూ అని ఆయన అన్నారా? తన దరఖాస్తు ఆమోదం పొందేలా భారత దేశం దౌత్యపరమైన అనేక చర్యలు తీసుకొంది. కేవలం చైనాను దృష్టిలో పెట్టుకోకుండా ఎన్‌ఎస్‌జి సభ్యత్వ దేశాలన్నిటినీ కలుపుకుపోవాలని భారత్ ప్రయ త్నించింది. ముఖ్యంగా న్యూజిలాండ్ మద్దతు కోసం ఆశపడింది. అయితే ఇటీవల ఆ దేశ ప్రధాని భారత్ సందర్శిం చినప్పుడు ఈ అంశంలో భారత్‌కు తిరుగులేని మద్దతు ఏమీ ప్రకటించలేదు.

ఈ అంశంలో చైనాను శత్రువుగా చూపడం ద్వారా భారత్ ఎవరి ప్రాపకం కోసం ప్రాకులాడుతోందో తెలియదు. చైనా వల్లనే తనకు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం లభించడం లేదని అన్నట్లుగా భారత్ ప్రచారం చేస్తోంది. చైనాకు వ్యతిరేకంగా దేశంలో అభిప్రాయాన్ని రేకెత్తిం చాల్సిన ప్రత్యేక అవసరం ఏదీ లేదు. ఎందుకంటే అటువంటి అభిప్రాయం ఈసరికే ఉంది. కాబట్టి దేశంలోని శక్తులను కాకుండా బయటి శక్తులను మంచి చేసుకోవడానికి చైనాపై భారత్ నింద మోపుతోందా అన్న సందేహం కలగకమానదు.
పాకిస్థాన్‌కు అణు బాంబు తయారీలో చైనా దోహదపడుతోందని దేశంలోని ప్రజలు నమ్ముతూ చైనాను విమర్శిస్తు న్నారన్నది అర్థం చేసుకోవచ్చు. యురి దాడి నేపథ్యంలో ఇటువంటి అభిప్రాయాలు తీవ్రమవ డం కూడా అర్థం చేసుకోదగ్గదే. పాకిస్థాన్ పై ఎదురు దాడికి భారత దేశానికి గల అవకా శాలు పరిమితం కాబట్టి అటువంటి అక్కసు చైనాపై మరింత పెరుగుతుంది. భారత, పాక్‌లు రెండూ అణ్వస్త్ర దేశాలు అవడంతో దాడి, ప్రతి దాడి అవకాశాలు మృగ్యం. అయితే ఎన్‌ఎస్‌జి అంశం అంతర్జాతీయ రాజకీయాలకు సంబంధి ంచినది. కేవలం తమ ప్రాంతానికి చెందిన సమస్యను అంతర్జాతీయ స్థాయి అంశంతో ముడిపెట్టడం భావ్యంగా లేదు. వాస్తవ దృష్టి కలవా రమని చెప్పుకునే భారతీయ విశ్లేషకులు కూడా గుడ్డిగా చైనాను ఈ విషయంలో ఆడిపోసుకుంటున్నారు. అయితే అలా చేయడం వల్ల ఎన్‌ఎస్‌జి సభ్యత్వాన్ని భారత్ పొందగలుగుతుందా అన్నది ప్రశ్న.
చైనాతో సహా అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడ దలుచుకుంటే భారత్ తన వైఖరిని మార్చుకొని ప్రత్యామ్నాయ మా ర్గాలు అన్వేషించాలి. ఎన్‌ఎస్‌జి నుంచి అనుకూల నిర్ణయాన్ని 2008 లో భారత్ సాధించింది. ఆంక్షలను అది రద్దు చేసింది. అయితే అప్ప టివలె కాకుండా ఇప్పుడు చైనా-అమెరికా సంబంధాలు అంత ప్రో త్సాహకరంగా లేవు. నిజం చెప్పాలంటే అవి రానురాను దిగజారు తు న్నాయి. అందుకు కారణాలు చాలా ఉన్నాయి. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలపై ఇరు దేశాల దృష్టి మళ్లడం ఒక కార ణం.అమెరికా పట్టులోకి జారుకుంటూ భారత్ తనపై వ్యతిరేకత పెంచుకుం టున్నట్లు చైనా ప్ర స్తుత ప్రభుత్వం నిజంగా భావిస్తే ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వానికి మరింతగా అది అడ్డుప డవచ్చు. అందుకు ‘అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పం దంపై భారత్ సంతకం చేయలేదు’ అన్న ఒకేఒక్క కారణాన్ని చైనా సాకుగా వాడుకోవచ్చు. దక్షిణ చైనా సముద్ర జలా ల్లో హక్కుల కోసం చైనా అంతర్జాతీయ ఒప్పందాలను పక్కన పెట్టిం ది. కాని ఎన్‌ఎస్‌జిలో భారత్ ప్రవేశాన్ని అడ్డుకోవడానికి అంతర్జా తీయ ఒప్పందాన్నే వాడుకుంటోంది. దీనిని బట్టి అంతర్జాతీయ చట్టాలపట్ల చైనా ప్రభుత్వానికి గల అవగాహనను భారత్ అర్థం చేసుకోవాలి.
అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో ‘కర్ర గల వాడిదే బర్రె’ అన్న నానుడి ఎప్పుడూ నిజమవుతూ ఉంటుంది.

-జబిన్ టి. జాకబ్