Friday, March 29, 2024

కక్ష్యలో చైనా లాంగ్‌మార్చ్

- Advertisement -
- Advertisement -
china long march rocket launch
రాకెట్ నుంచి 9 శాటిలైట్లు

బీజింగ్ : చైనా వినువీధిలో తన లాంగ్‌మార్చ్ నిర్వహించింది. మంగళవారం పచ్చసముద్రం నుంచి ఓ షిప్‌లో అమర్చిన అత్యంత శక్తివంతమైన వాహక రాకెట్ ద్వారా ఏకంగా ఒకేసారి తొమ్మిది ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. నిర్ణీత కక్ష్యలోకి వీటిని దూసుకువెళ్లేలా చేసింది. సముద్ర ఉపరితలం నుంచి చైనా ఇటువంటి ప్రయోగానికి దిగడం ఇది రెండోసారి లాంగ్ మార్చ్ 11 హై 2 రాకెట్‌ను డెబో 3 నౌకా ఉపరితలం నుంచి ప్రయోగించారు. ఈ నౌకనే ఈ రాకెట్ సహిత శాటిలైట్ల ప్రయోగ వేదికగా మలిచారు. జిలిన్ 1 గవోఫెప్ గ్రూప్ శాటిలైట్లు తొమ్మది ఈ రాకెట్ నుంచి వేర్వేరు సమయాలలో నిర్ణీత కక్షల్లోకి దూసుకువెళ్లాయి. ఎల్లో సీ అంతా ఈ ప్రయోగం దశలో వింత కాంతులతో మిరుమిట్లు గొల్పింది. రాకెటు ముందుగా 13 నిమిషాల పాటు దూసుకువెళ్లిన తరువాత 535 కిలోమీటర్ల ప్రయాణం తరువాత శాటిలైట్లను ఆయా కక్ష్యలోకి పదిలరీతిలో ప్రవేశపెట్టింది.

ఇందులో అత్యధిక సాంద్రతల భూ పర్యవేక్షక శాటిలైట్లు కూడా ఉన్నాయి. ఇటువంటి వాటిని చైనా ఇటీవలి కాలంలో అత్యధిక సంఖ్యలో సంతరించుకుంటూ వస్తోంది. ఇక ఎప్పటికప్పుడు భూమి వీడియోలను తీసుకునే మూడు శాటిలైట్లను, సన్ సింక్రోనస్ ఆర్బిట్స్ ఫోటోలు తీసుకునే ఆరు శాటిలైట్లు కూడా ఉన్నాయి. 42 కిలోల బరువు ఉండే ఒక్కో శాటిలైట్‌ను జిలిన్ ప్రాంతంలోని చంగ్‌చూయాన్‌లోని శాటిలైట్ టెక్నాలజీ సంస్థలో రూపొందించారు. ఈ శాటిలైట్ల సాయంతో మారుమూల ప్రాంతాల సమాచారం ఎప్పటికప్పుడు సమీకరించేందుకు వీలేర్పడుతుంది. దీనిని ఎప్పటికప్పుడు వ్యవసాయ, అటవీ పరిరక్షణ, భూ వనరులు, పర్యావరణ పరిరక్షణ ఇతర విషయాలకు వినియోగించుకోవచ్చునని అధికారిక నివేదికలో తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News