Home అంతర్జాతీయ వార్తలు విదేశీ వైద్య విద్యార్థులపై చైనా ఆంక్షలు

విదేశీ వైద్య విద్యార్థులపై చైనా ఆంక్షలు

China

 

ఇంగ్లీష్‌లో ఎంబిబిఎస్ 45 కాలేజీలకే పరిమితం
బీజింగ్ నిర్ణయం: భారత్‌కు అశనిపాతం

బీజింగ్: విదేశీ విద్యార్థులకు ఇంగ్లీష్‌లో ఎంబిబిఎస్‌ను బోధించేందుకు మొత్తం 200మెడికల్ కాలేజీల్లో కేవలం 45 కళాశాలలకే చైనా విద్యా మంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. ఎంబిబిఎస్ చేయాలనుకునే అనేకమంది భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం పడవచ్చు. మెడిసిన్ చదివేందుకు భారతీయ విద్యార్థులు రికార్డు స్థాయిలో చైనా యూనివర్శిటీల్లో పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల కంటే ఇక్కడ కోర్సులు వారి స్తోమతకు తగ్గట్టు అందుబాటులో ఉం టాయి కాబట్టి విదేశీ విద్యార్థులు ముఖ్యంగా భారత్, ఆసియా దేశాలకు చెందినవారు చైనా వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం చైనా విశ్వవిద్యాలయాల్లో 23వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు రకరకాల కోర్సులు చదువుతున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చినవారు 28 వేల మంది ఉన్నారు. మొత్తంమీద 5 లక్షల మంది విదేశీ విద్యార్థులు చైనా విశ్వవిద్యాలయాల్లో ఉన్నారు.

23 వేల మంది భారతీయ విద్యార్థుల్లో ఇదివరకు ఎన్నడూ లేనంతగా 21వేల మంది ఎంబిబిఎస్ కోసం నమోదు చేసుకున్నారు. చైనాలో మెడికల్ కోర్సు చేయాలనుకునే భారతీయ విద్యార్థుల ఆసక్తిని పరిగణనలోకి తీసుకున్న ఇక్క డి భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన చేసిం ది. విదేశీ విద్యార్థులకు ఇంగ్లీష్‌లో ఎంబిబిఎస్ బోధించేందుకు దేశంలో కేవలం 45 మెడికల్ కాలేజీలకు మా త్రమే చైనా విద్యా మంత్రిత్వశాఖ (ఎంఓఇ) అనుమతిచ్చిందని తెలిపింది. జాబితాలో లేని విశ్వవిద్యాలయాలు ఇంగ్లీష్‌లో ఎంబిబిఎస్ బోధనకు విదేశీ విద్యార్థుల్ని చేర్చుకోకూడదని ఆయా విశ్వవిద్యాలయాలకు తెలిపినట్టు చైనా ఎంఓఇ స్పష్టం చేసిందని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

China restricts teaching of MBBS in English to 45 colleges