Thursday, April 25, 2024

అమెరికా రక్షణ కంపెనీలపై చైనా ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

China sanctions on American defense companies

 

బీజింగ్ : మూడు ప్రముఖ అమెరికా రక్షణ ఉత్పత్తుల సంస్థలపై చైనా ఆంక్షలు విధించింది. ఈ సంస్థలు తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని పేర్కొంటూ ఈ చర్య తీసుకుంది. చైనా ఆంక్షల వేటుపడ్డ యుఎస్ సంస్థలలో బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ కూడా ఉన్నాయి. కరోనా ఇతర అంశాలతో పాటు తైవాన్‌కు ఆయుధాల విషయంలో కూడా చైనా అమెరికా మధ్య వివాదాలు రాజుకుంటూ పోతున్నాయి. ఈ దశలోనే ఇటీవలే తైవాన్‌కు 135 స్లామ్ ఇఆర్ ల్యాండ్ అటాక్ క్షిపణులను విక్రయించడానికి అమెరికా రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. వీటివిలువ దాదాపుగా ఒక బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఇక తైవాన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలు సరఫరా చేస్తూ వస్తున్న అమెరికా రాకెట్లు, పలు రకాల యుద్ధ సామాగ్రులను విక్రయిస్తూ వచ్చింది. వీటన్నింటి విలువ దాదాపు 367.2 మిలియన్ డాలర్ల వరకూ ఉంటుందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అమెరికా ప్రముఖ డిఫెన్స్ కంపెనీల పై ఆంక్షలకు దిగినట్లు చైనా అధికారికంగా ప్రకటించిన విషయాన్ని ఈ పత్రిక ధృవీకరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News