Wednesday, April 24, 2024

చంద్రుని అగ్ని పర్వతాలపై మారిన అంచనాలు: చైనా

- Advertisement -
- Advertisement -

China says moon rocks offer new clues

బీజింగ్: చంద్రమండలం నుంచి తెచ్చిన రాళ్లను పరీక్షించగా అక్కడి అగ్ని పర్వతాలపై గత అంచనాలు మారాయని చైనా తెలిపింది. గతేడాది తమ రొబోటిక్ వ్యోమనౌక తెచ్చిన శాంపిళ్లను (రాళ్లను) పరీక్షించగా కొత్త విషయాలు వెలుగు చూశాయని చైనా పరిశోధకుడు లి జియాన్‌హువా తెలిపారు. గత అంచనాల ప్రకారం చంద్రునిపై 280300 కోట్ల ఏళ్ల మధ్య అగ్ని పర్వతాలు ఉండేవి. తాజా పరిశోధనలో 200 కోట్ల ఏళ్ల క్రితం వరకూ అక్కడ అగ్ని పర్వతాలు చురుగ్గా ఉన్నట్టు తేలిందని లి తెలిపారు. గత డిసెంబర్‌లో చైనా మొదటిసారిగా చంద్రుని నుంచి రాళ్ల శాంపిళ్లను భూమిపైకి తెచ్చింది. 1970లలో అమెరికా, రష్యా ఈ ఘనతను సాధించాయి. రోదసీ కార్యక్రమాల్లో చైనా ఇటీవల పలు మైలురాళ్లను చేరుకున్నది. రోదసిలోకి సొంతంగా వ్యోమగామిని పంపిన మూడో దేశంగా 2003లో చైనా రికార్డు సాధించింది. అంతకుపూర్వం రష్యా, అమెరికా మాత్రమే ఈ ఘనతను సాధించాయి. శనివారం చైనా మరో ముగ్గురు వ్యోమగాముల్ని తమ స్పేస్ స్టేషన్‌కు పంపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News