Home అంతర్జాతీయ వార్తలు చైనా సినోవాక్ వ్యాక్సిన్ ధర రూ 4,395

చైనా సినోవాక్ వ్యాక్సిన్ ధర రూ 4,395

China Sinovac vaccine priced at Rs 4,395

 

బీజింగ్ : చైనా ఔషధ కంపెనీ సినోవాక్ బయోటెక్ లిమిటెడ్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్‌ను 60 డాలర్లకు (దాదాపు రూ 4398) విక్రయించేందుకు ముందుకు వచ్చారు. చైనా తూర్పు ప్రాంతమైన జిజియాంగ్‌లోని జియాక్సింగ్ నగరంలో దీనిని అత్యయిక స్థితిలో వాడేందుకు మార్కెట్ చేస్తున్నారు. అయితే వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు నిర్థారణ అయిన వారికి దీనిని అత్యవసర పద్ధతిలో వాడుతారు. ఈ కరోనా వాక్‌ను ఆ తరువాత క్రమపద్ధతిలో సామాన్యుడికి కూడా అందుబాటులోకి తెస్తారని, ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతాయని అధికారిక మీడియా తెలిపింది.

ప్రస్తుతానికి ఈ వ్యాక్సిన్‌ను ఈ ప్రాంతంలో ఈ వైరస్ నియంత్రణ చర్యలలో ఉండే వర్కర్లకు, అత్యవసర సేవల సిబ్బందికి, రేవుల పర్యవేక్షకులకు అవసరాన్ని బట్టి వాడుతున్నారు. సినోవాక్ బయోటెక్ కంపెనీ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ధర రెండు డోసుల పద్ధతిగా 18 నుంచి 59 ఏండ్ల లోపు వారిలో వైరస్ నివారణకు వాడుతారని, దీని ధర చైనా కరెన్సీలో చూస్తే 400 యువాన్లు అని జియాక్సింగ్ అంటువ్యాధుల నివారణ కేంద్రం (సిడిఎస్) తెలియచేసినట్లు అధికారిక వార్తా సంస్థలు వార్తాకథనాలు వెలువరించాయి.

China Sinovac vaccine priced at Rs 4,395