Friday, April 19, 2024

భారత ప్రముఖులపై చైనా నిఘా..

- Advertisement -
- Advertisement -

భారత ప్రముఖులపై చైనా నిఘా
10 వేల మంది వ్యక్తుల సమాచారం సేకరణ

న్యూఢిల్లీ: చైనా ప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు కలిగిన డేటా సంస్థ జెన్‌హువా భారత దేశంలోని పదివేల మందితోపాటు సంస్థల పైన నిఘా ఉంచినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం కథనం వెలువడడంతో కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. షెంజెన్ అనే సంస్థ ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు వేలాది మంది వ్యక్తిగత సమాచారం చైనా ప్రభుత్వానికి, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అందచేస్తున్నట్టు తెలియడంతో జాతీయ భద్రతకు ముప్పు కలిగే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తోంది. రాజకీయ నేతల నుంచి వాణిజ్యం, న్యాయవ్యవస్థ నుంచి మీడియాకు చెందిన ప్రముఖుల వ్యక్తిగత వివరాలపై ఈ సంస్థ కన్నేసి ఉంచినట్టు తెలుస్తోంది. ఎంతవరకు డేటా సేకరించిందో జాతీయ భద్రతకు ఎంతవరకు ముప్పు ఏర్పడుతుందో సైబర్ సెక్యూరిటీతో ప్రత్యక్ష సంబంధాలున్న జాతీయ భద్రతా వ్యవస్థ సమీక్షిస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరుగుతున్నట్టు ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

ఏ స్థాయిలో చైనా సంస్థ వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరించిందో దీనికి సంబంధించిన హార్డ్‌వేర్‌కు ఏమాత్రం భాగస్వాములు ఆర్థికంగా వెచ్చించారో సమీక్షిస్తున్నట్టు చెప్పారు. మనవైపు ఎంతవరకు సైబర్ పరిశుభ్రతను అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందో సమీక్షించనున్నట్టు వివరించారు. కేంద్ర ఎలెక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖతో సహా సంబంధిత సైబర్ సెక్యూరిటీ, సైబర్ లా విభాగాలు దీనిపై చర్చించాయి. ఇందులో ప్రధాని, రాష్ట్రపతి ప్రమేయం ఉన్నప్పటికీ ప్రభుత్వ స్పందన దీనిపై ఏమిటో తెలియవలసి ఉందని ఆయా వర్గాలు అభిప్రాయపడ్డాయి. భారత్ లోని వివిధ సంస్థల కార్యకలాపాలతోపాటు ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, కేంద్రమంత్రులు, ప్రముఖ సంస్థల సిఇఒలు, సిఎఫ్‌ఒల కదలికలపై చైనా కంపెనీ కన్నేసినట్టు తెలుస్తోంది.

China spying on 10000 Indian Celebrities  

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News