Wednesday, April 24, 2024

పంగోలిన్ రక్షణకు చైనా చర్యలు

- Advertisement -
- Advertisement -

China steps into Pangolin defense

 

బీజింగ్ : చైనాలో ఇప్పుడు పంగోలిన్ (అలుగు) జంతువుకు భద్రతను పెంచింది. ఈ ప్రాణి కరోనావైరస్ వ్యాప్తిలో మధ్యంతర వాహకంగా ఉందని వెల్లడైంది. అయితే చైనాలో పంగోలిన్ మాంసాన్ని బాగా ఇష్టపడి తింటారు. అంతేకాకుండా దీనిపై ఉండే దళసరి పొలుసులు సాంప్రదాయక చైనా వైద్యంలో మూలకాలుగా వాడుతారు. అత్యంత భారీ స్థాయి పాండా ఎలుగుబంటి ఇప్పుడు అంతరించిన తెగగా మారిన దశలో పంగోలిన్ రక్షణకు చైనా భద్రత చర్యలను ముమ్మరం చేశారు.సాండాల స్థాయిలో వీటి రక్షణకు ఏర్పాట్లు చేపట్టారు.

వీటిని రక్షిత జంతువుల జాబితాలో ప్రాధాన్యత స్థాయికి చేర్చారు. పంగోలిన్ మాంసాన్ని ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంది. దీనితో దీని అక్రమరవాణా జరుగుతోంది. గత దశ్దాబ్దంలో తేలిన లెక్కల ప్రకారం చూస్తే దాదాపు పదిలక్షల వరకూ అలుగులను వేటగాళ్లు పట్టుకున్నారు. ప్రతి ఏటా 20 టన్నుల వరకూ దీని శరీర భాగాలను, వీటిని స్మగ్లింగ్ చేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పుడు పంగోలిన్ కూడా చర్చనీయాంశం అయింది. కోవిడ్ 19 పాములు, గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతోందని, అవి వైరస్ మాధ్యమాలు అవుతున్నాయని తొలుత భావించారు. అయితే చైనా శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల క్రమంలో అలుగులు కూడా వైరస్ వ్యాప్తిలో మధ్యంతర హోస్ట్‌లు అవుతున్నట్లు నిర్థారించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News