Thursday, April 25, 2024

చైనా స్వంత అంతరిక్ష కేంద్రానికి ముగ్గురు వ్యోమగాముల పయనం

- Advertisement -
- Advertisement -
China Successfully Launches Shenzhou-12 Spacecraft
విజయవంతంగా అంతరిక్ష నౌక షెస్‌జూ 12 ప్రయోగం, నిర్మాణంలో ఉన్న స్పేస్ స్టేషన్ లోకి ముగ్గురు

బీజింగ్ : చైనా స్వంతంగా నిర్మించుకున్న అంతరిక్ష కేంద్రానికి గురువారం ఉదయం ముగ్గురు వ్యోమగాములను పంపించింది. లాంగ్‌మార్చ్ 2 ఎఫ్ రాకెట్ ద్వారా షెస్‌జూ 12 కాప్సూల్‌లో టియాంగాగ్ స్టేషన్ నుంచి నీహైషెంగ్, లయూబోమింగ్, టాంగ్‌హోంగ్‌బో అనే ముగ్గురు వ్యోమగాములు బయలు దేరారు. వీరు అంతరిక్ష కేంద్రంలో మూడు నెలలు ఉంటారు. భూమికి 380కిమీ ఎత్తులో తియాన్‌హీ మాడ్యూల్‌లో వారు ఉంటారు. చైనా గోబీ ఎడారి లో ప్రయోగించిన ఈ రాకెట్ గురువారం ఉదయం 9.22 గంటలకు నింగి లోకి దూసుకెళ్లింది. చైనా తన స్వంత టెక్నాలజీతో అభివృద్ధి చేస్తోన్న స్పేస్‌స్టేషన్ ను పూర్తి చేసే క్రమంలో షెన్‌జో12…11 మిషన్లలో మూడోది. ముగ్గురు వ్యోమగాములు అక్కడ ఉన్న తియాన్ హీ మాడ్యూల్‌ను ఆపరేట్ చేయనున్నారు. తియాన్‌హీ సిలిండర్‌ను ఏప్రిల్‌లో చైనా ప్రయోగించింది. దీన్లో లివింగ్ క్వార్టర్స్, సైన్స్ ల్యాబ్స్, హబుల్ క్లాస్ టెలిస్కోప్‌లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News