Home అంతర్జాతీయ వార్తలు ‘ ఆ పిల్లి చనిపోయింది…’

‘ ఆ పిల్లి చనిపోయింది…’

China’s ‘Psychic’ Ginger Cat dies

బీజింగ్ : ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో ఆరు మ్యాచ్‌ల ఫలితాలను అంచనా వేసిన బైదియనెర్ అనే పిల్లి చనిపోయింది. అర్జెంటీనా, నైజీరియా మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్‌లో విజేతను ఆ పిల్లి అంచనా వేసింది. ఈ పిల్లి అనారోగ్యానికి గురై చనిపోయిందని బీజింగ్‌లోని ప్యాలస్ మ్యూజియం అధికారులు తెలిపారు. ఈ పిల్లి బీజింగ్ వీధుల్లో తిరుగుతుండగా ప్యాలస్ మ్యూజియం అధికారులు చేరదీశారు. దానికి రెండు కప్పుల్లో ఆహారం పెట్టి, ఆ రెండు కప్పుల వద్ద రెండు టీమ్‌ల జెండాలు పెట్టేవారు. ఆ పిల్లి ఏ కప్పు వద్దకు వెళ్లి ఆహారం తీసుకుంటే, ఆ టీమ్ విజేతగా గెలుస్తుందని అంచనా వేసేవారు. ఆరు మ్యాచ్‌ల్లో ఆ పిల్లి విజేతలను అంచనా వేసింది. ఈ పిల్లి పేరు మీద ఓ వీబో అకౌంట్‌ను కూడా క్రియేట్ చేశారు. ట్విటర్‌లాగే చైనాలో వీబో చాలా ఫేమస్ అన్న విషయం తెలిసిందే. బైదియనెర్ మృతిపై పలువురు సంతాపం తెలిపారు. 2010 ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ సందర్భంగా జర్మనీలోని ఆక్వేరియంలో ఉన్న పాల్ అనే ఆక్టోపస్ కూడా ఇలాగే మ్యాచ్‌లను అంచనా వేసేది.

China’s ‘Psychic’ Ginger Cat dies