Home అంతర్జాతీయ వార్తలు డ్రాగన్ వెనక్కి

డ్రాగన్ వెనక్కి

Chine troops shift 2 km from galwan valley clash site

 

గల్వాన్ లోయ, గోగ్రాహాట్ స్ప్రింగ్ నుంచి ఒకటిన్నర కి.మీటర్లు తగ్గిన చైనా
గుడారాలు సైతం తొలగింపు, వాహనాలు ఉపసంహరణ ప్రక్రియ
రంగంలోకి ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రితో రెండు గంటలు టెలిఫోన్ సంభాషణ, 24 గంటల్లో మారిన సీన్, ఖాళీ ప్రక్రియ షురూ
క్షేత్ర స్థాయిలో నిర్ధారించుకోవలసి ఉంది : రక్షణ శాఖ వర్గాలు

న్యూఢిల్లీ/ లడఖ్: భారత్ చైనా సరిహదులోని గల్వాన్ లోయలో నెలల తరబడి కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడినట్లు కనిపిస్తోంది. సరిహద్దు వివాదం ఫలితంగా గత కొంతకాలంగా చోటు చేసుకొంటున్న హింసాత్మక ఘటనలకు ఇరు దేశాలు ముగింపు పలికినట్లుగా తెలుస్తోంది. తూర్పు లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్‌ఎసి) వద్ద గల్వాన్ లోయలో ఘర్షణలు జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ లడఖ్ వెళ్లి సైన్యాలతో మాట్లాడడం, అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగడంతో చైనా తోకముడిచి వెనక్కి తగ్గింది. భారత చర్చల ఫలితంగా ఎట్టకేలకు ఫింగర్ పాయింట్ 4 ప్రాంతం నుంచి చైనా సైన్యం వెనక్కి తగ్గింది. ఇరు దేశాల కోర్ కమాండర్ల చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకే చైనా బలగాలు వెనక్కి తగ్గాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అంతేకాకుండా చైనా సైన్యాలు పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద ఏర్పాటు చేసుకున్న టెంట్లు, ఇతర నిర్మాఱాలను కూడా తొలగిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. అలాగే గో గ్రాహాట్ స్పింగ్ ఏరియాలో చైనా ఆర్మీకి చెందిన వాహనాలు కూడా వెనక్కి వెళ్లడం కనిపిస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో చైనా సైన్యాలు గుడారాలు ఏర్పాటు చేయడం ఇరు పక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 15వ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలో 20 మంది భారత జవాన్లు మృతి చెందడంతో పాటు పలువురు గాయపడ్డారు. దీనిపై చైనాపై ప్రతీకారం తీసుకోవలసిందేనని యావత్ దేశం ముక్త కంఠంతో నినదించింది. అయితే చైనా ఆర్థిక మూలాలను దెబ్బ తీయాలని భావించిన భారత ప్రభుత్వం డిజిటల్ స్ట్రైక్ ద్వారా డ్గాన్‌ను కోలలుకోలేని దెబ్బ తీసింది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ గత వారం అనూహ్యంగా లడఖ్‌లో పర్యటించి చై నాకు గట్టి హెచ్చరికలు చేశారు. విస్తరణ వాదానికి కాలం చెల్లిపోయిందని,భారత భూభాగాలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా మన బలగాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు.

క్షేత్రస్థాయిలో ధ్రువీకరించుకోవాలి
కాగా, గల్వాన్ లోయ, గోగ్రా ప్రాంతాలనుంచి చైనా సైన్యం బలగాలు వెనక్కి తగ్గాయన్న వార్తలను క్షేత్రస్థాయిలో ధ్రువీకరించుకోవలసి ఉందని, ఇంకా ధ్రువీకరణ జరగలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘ టెంట్ల్ల తొలగింపు కనిపిస్తోంది. అయితే బలగాలు వెనక్కి వెళ్లాయా లేదా అన్న దానిపై మాత్రం క్షేత్రస్థాయిలో ధ్రువీకరించుకోవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎంత దూరం వెనక్కి వెళ్లారు అన్నది మాత్రం నిర్ధారింపబడలేదు’ అని ఓ అధికారి తెలిపారు. అయితే గాల్వన్ లోయలో చైనా దళాలు మాత్రం వేసుకున్న టెంట్లను తొలగించినట్లు కొందరు అధికారులు తెలిపారు.

ఉద్రిక్తత తగ్గించడంలో పురోగతి: చైనా
బీజింగ్: వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ లోయలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి, వెనక్కి తగ్గే విషయంలో సరిహద్దల్లోని బలగాలు నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నాయని చైనా సోమవారం ప్రకటించాయి. గాల్వన్ లోయలోని కొన్ని ప్రాంతాలనుంచి చైనా సైన్యాలు టెంట్లను తొలగించడంతో పాటుగా వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోందని న్యూఢిల్లీలో అధికార వర్గ్గాలు ప్రకటించిన తర్వాత చైనా విదేశంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఈ విషయం ప్రకటించారు. గల్వాన్ లోయలో ఉద్రిక్త ప్రాంతాలనుంచి చైనా సైన్యాలు వెనక్కి తగ్గడం గురించి విలేఖరులు అడగ్గా, సరిహద్దులోని బలగాలు వెనక్కి తగ్గడానికి, ఉద్రిక్తతలను గ్గించడానికి తగు చర్యలు తీసుకోవడంలో పురోగతి ఉంది’ అని ఝావో తెలిపారు.

దోవల్ దౌత్యం.. చైనా విదేశాంగ మంత్రితో చర్చలు

ఇక మోడీ లడఖ్ పర్యటన అనంతరం అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్‌లతో సమావేశమైన అజిత్ దోవల్ ఆదివారం సాయంత్రం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో దాదాపు రెండు గంటల సేపు వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా టెలిఫోన్ చర్చలు జరిపారు.సమస్య పరిష్మాకరానికి చొరవ చూపాలని, వివాదాస్పద ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గాలని చైనా మంత్రిని కోరారు.ఈ నేపథ్యంలో ఇరువురు నేతల చర్చల అనంతరం చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. భారత్ బలగాలు కూడా వెనక్కి తగ్గుతాయని ఈ సందర్భంగా దోవల్ వాంగ్ యికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు జరిగిన 24 గంటల్లోపై చైనా బలగాలు వెనక్కి తగ్గడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Chine troops shift 2 km from galwan valley clash site