Thursday, April 18, 2024

చైనాలో కొత్త సంవత్సరం జోష్

- Advertisement -
- Advertisement -

కొవిడ్ ఆంక్షలు ఎత్తేసిన నేపథ్యంలో వేడుకల్లో మునిగి తేలిన ప్రజలు

బీజింగ్: చైనాలో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను ఎత్తివేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం కొత్త సంవత్సరం వేడుకల్లో మునిగిపోయారు. పెద్ద సంఖ్యలో జనం కుటుంబ సభ్యులను కలుసుకోవడం, ఆలయాలను సందర్శించడం వంటి కార్యక్రమాల్లో మునిగిపోయారు. చైనాలో కరోనా మహమ్మారి వెలుగు చూసిన మూడేళ్ల తర్వాత దేశ ప్రజలు కొత్త సంవత్సరం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం ఇదే మొదటిసారి. కొవిడ్ ఆంక్షలను దాదాపుగా సడలించడంతో ఇతర దేశాల్లోని చైనీయులుపెద్ద సంఖ్యలో తొలిసారి తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడం కోసం స్వస్థలాలకు పయనమయ్యారు. పెద్ద ఎత్తున బహిరంగ వేడుకలు సైతం దర్శనమిస్తున్నాయి.

దేశ రాజధాని బీజింగ్‌లో వేల సంఖ్యలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. చైనాలో కొత్త సంవత్సరం ఎంతో ముఖ్యమైన పండగ. ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించడంతో జనం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ.ఈ ఏడాది కొత్త సంవత్సరాన్ని ‘రాబిట్’ సంవత్సరంగా పిలుస్తారు. అయితే ఇలా పెద్ద సంఖ్యలో జనం చేరడం వల్ల కొత్త ప్రాంతాలకు కొవిడ్ మహమ్మారి మరోసారి విజృంభించే ప్రమాదం ఉందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌లో అంటువ్యాధుల చీఫ్ వు జున్యో హెచ్చరిస్తున్నారు. చైనా జనాభాలో 80 శాతం మంది ఇప్పటకే కరోనా బారిన పడ్డారని, రోజూ వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News