Home కామారెడ్డి మన అందరిదీ ఒకే కుటుంబం.. అది భగవంతుని కుటుంబం

మన అందరిదీ ఒకే కుటుంబం.. అది భగవంతుని కుటుంబం

Chinna Jeeyar Swamyగాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం తాండాలో ఏర్పాటు చేయనున్న శ్రీ కోదండరామస్వామి దేవాలయానికి బుధవారం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వాముల వారు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు భక్తులను ఉద్దేశించి ప్రసంగిస్తూ లోకాలను పాలించేవాడు దేవుడు ఒక్కడేనని, మనలోపలే ఉండి కాపాడుతున్నారని ఆయనే మనకు శరీరం అని అన్నారు. ప్రజలు భగవంతునిపై మంచి భావన సంకల్పాలతో పని చేస్తారో అక్కడ ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుందని, ప్రతి మనిషిలో ఉన్న చెడును, ద్వేషాన్ని విడనాడాలని, ప్రేమను, మంచిని పెంచుకొని ఒకే కుటుంబంలా ముందుకు సాగాలని అన్నారు. మనందరిదీ ఒకటే కుటుంబమని అది భగవత్ కుటుంబమని ఆయన అన్నారు. సమాజంలో ప్రతీది దైవ కల్పితమని, దైవానుగ్రహం లేనిదే ఏది సాధ్యాంకాదని ఆయన చెప్పారు.

మారుమూల తిప్పారం తాండాలో శ్రీ కోదండరామస్వామి ఆలయం నిర్మించడం ఎంతో గొప్ప విశేషమని, ఇంత చిన్న తాండాలో దేవాలయం నిలుపుకోవడం తాండా ప్రజలు 15 సంవత్సరాల నుండి పోగు చేసుకున్నటువంటి కోటికి పైగా రూపాయలతో గుడి నిర్మించడం ఎంతోగొప్ప విశేషమని, యజ్ఞయాగాలు, భగవన్నామస్మరణ లోకశాంతికి ఉపకరిస్తాయని ఆయన వివరించారు. దైవానుగ్రహంతోనే ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. అనంతరం ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ మాట్లాడుతూ తాండా వాసులు కలిసికట్టుగా దేవాలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించడం, గ్రామంలో ప్రతిఒక్కరు కలిసిమెలిసి ఉండాలని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని అన్నారు. అనంతరం వారు తనవంతు ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి లక్ష రూపాయలు అందజేశారు.

Chinna Jeeyar Swamy says We are One Family