Thursday, March 28, 2024

చిరంజీవి తొలి చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ మృతి

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ‘పునాదిరాళ్లు’ దర్శకుడు గుడిపాటి రాజ్‌కుమార్ మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం కన్నుమూశారు. ఇక ‘పునాదిరాళ్లు’ చిత్రం రాజ్‌కుమార్‌కు కూడా మొదటి సినిమానే. తొలి చిత్రానికే ఆయన ఐదు నంది అవార్డులను దక్కించుకోవడం విశేషం. రాజ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసి ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కొంతకాలం క్రితం ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య చనిపోవడంతో రాజ్‌కుమార్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పైసా సంపాదన లేక అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చివరికి అనారోగ్యంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతిచెందారు. ఆయన స్వగ్రామం విజయవాడ సమీపంలోని ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరు కు తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 1979లో పునాది రాళ్లు చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్.. ఈ సామ్రాజ్యం మాకొద్దు, మన ఊరి గాంధీ, ఇంకా తెలవారదేమి, తాండవ కృష్ణ తరంగం, మా సిరి మల్లి చిత్రాలను రూపొందించారు.

Chiranjeevi First Film Punadi Rallu Director Passed away

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News