హైదరాబాద్: ‘తొలిప్రేమ’ సినిమాను తీసింది..కొత్త దర్శకుడా అని చిరంజీవి షాకయ్యారు. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రాశీఖన్నా కథానయిక వెంకీ అట్లూరి దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్. ఈ చిత్రాన్ని నిర్శించారు. ఈ సినిమాను దిల్‌రాజు విడుదల చేశారు. బుధవారం ఈ చిత్ర విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్ మాట్లాడుతూ నాపై నా, వెంకీపైనా నమ్మకంతో దిల్‌రాజుగారు ఈ సినిమాను తీసుకొచ్చారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. సినిమాపై వెంకీకి ఉన్న ఇష్టం ప్యాషన్ ఇందులో కనపడతాయి. వెంకీ సిని కెరీర్ సుదీర్ఘంగా సాగాలి. సినిమా చూసిన చిరంజీవి గారు ఇది తీసింది కొత్త దర్శకుడా? అని షాకయ్యారు. మాకు అదోక పెద్ద కాంప్లిమెంట్ తెరపై నాది, రాశీఖన్నా కెమిస్ట్రీ బాగున్నా, తెరవెనుక జార్జ్, తమన్, వెంకీ కెమిస్ట్రీ వర్క్ అవుట్ కావడం వల్లే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. వాళ్లు సినిమాను బాగా ప్రేమించారు. వర్ష పాత్రలో రాశీఖన్నా బాగా ఒదిగిపోయింది. జనాల నుండి వస్తున్న అభినందనలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు.
‘తొలిప్రేమ’ కు ఫిదా అయిన చిరంజివి
- Advertisement -
- Advertisement -