- Advertisement -
మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి.. తన కొడుకు 150 వ మూవీ ఖైదీనెం150 ని చూసింది. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్యా థియేటర్ లో బుధవారం ఉదయం అంజనాదేవి కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.
మూవీ చూసిన అనంతరం మీడియాతో తన సంతోషాన్ని పంచుకుంది అంజనాదేవి. 60 ఏళ్ల వయసులోనూ ఎంతో హుషారుగా… చిన్న కుర్రాడిలా డ్యాన్స్, ఫైట్లతో ఇరగదీశాడని… ఖైదీని మెచ్చుకుంది అంజనాదేవి.
- Advertisement -