Friday, March 29, 2024

అంజనా ప్రొడక్షన్స్‌లో చిరు సినిమా..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ వ్యవహారాల్ని నాగబాబు చూస్తుంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే గత కొంతకాలంగా అంజనా ప్రొడక్షన్స్ నిర్మాణ వ్యవహారాల్లో వెనకబడిపోయింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ బ్యానర్‌లో మెగా ఉత్సాహం నింపేందుకు తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. త్వరలోనే చిరంజీవి హీరోగా అంజనా ప్రొడక్షన్ బ్యానర్‌లో ఓ సినిమా నిర్మితం కానుందట. అయితే అంజనా ప్రొడక్షన్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని తెలిసింది. నిజానికి మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజైన గురువారం ఈ విషయమై ఓ ప్రకటన రాబోతోందన్న గుసగుసలు వినిపించాయి. అయితే కొన్ని కారణాలతో అది వాయిదా పడిందట. ఇక నాగబాబు పుట్టిన రోజు వేడుకల్లో చిరంజీవి పాల్గొని సందడి చేశారు. ఇదిలా వుండగా అంజనా ప్రొడక్షన్స్ వ్యవహారాలు ఇకపై నాగబాబు కుమార్తె నిహారిక చూసుకోనుందనేది తెలిసింది. ఈ విషయమై మెగా బ్రదన్ నాగబాబు స్పందన కోసం మెగాభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు ఇదే అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో పలు విజయవంతమైన సినిమాలొచ్చాయి.

Chiranjeevi next film in Anjana Production?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News