Home తాజా వార్తలు నా కెరీర్‌లో ‘సైరా’కి మొదటి స్థానం: చిరంజీవి

నా కెరీర్‌లో ‘సైరా’కి మొదటి స్థానం: చిరంజీవి

Sye raa

 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా… నరసింహారెడ్డి’ ఇటీవల విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సోమవారం చిత్ర బృందం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి, సురేందర్ రెడ్డి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాయిచంద్, రవికిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు అమితాబ్‌బచ్చన్ నాతో మాట్లాడుతూ ‘ఇది మామాలు సినిమా కాదు… ఓ గౌరవప్రదమైన సినిమా. మన దేశంలో ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి.

ఇలాంటి సినిమాలో నేను నటించడం సంతోషంగా ఉంది’అన్నారు. ఆయన అన్న మాటలు నాకు ఎంతో ఆనందాన్నిచ్చాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి తీసిన కిక్, రేసుగుర్రం, ధృవ చిత్రాలు నాకు బాగా నచ్చాయి. చారిత్రక చిత్రం ‘సైరా’ను అద్భుతంగా తీయగలడనే నమ్మకంతో అతన్ని దర్శకుడిగా తీసుకున్నాం. ‘సైరా’కు దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అయింది. బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. నిర్మాతగా వాడికి 100 మార్కులు వేస్తాను. అలాగే ఈ చిత్రానికి కూడా 100 మార్కులు వేస్తా. నా కెరీర్‌లో ‘సైరా’ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ చిత్ర ఘన విజయం నాకెంతో ఆనందాన్నిచ్చింది”అని అన్నారు.

Chiranjeevi said Sye raa is best Film in my Career