Thursday, April 25, 2024

‘పెళ్లి సందD’ పెద్ద హిట్ అవుతుంది: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోషన్, శ్రీలీల జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘పెళ్లి సందD’. ఈ మూవీని రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వర్క్, ఆర్.కె.ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణమోహన్ రావు సమర్పణలో మాధవి కోవెల మూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ “1996లో శ్రీకాంత్ హీరోగా చేసిన ‘పెళ్లిసందడి’ ఘన విజయం సాధించింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న ఈ ‘పెళ్లి సందD’ చిత్రం ఆ సినిమాలాగా సందడి చేస్తుందని భావిస్తున్నాను”అని అన్నారు. విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ “ఈ దసరాకు దర్శకేంద్రుడు దుమ్ములేపేస్తాడని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది”అని పేర్కొన్నారు. కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ “ఈ చిత్రంలో నేను చిన్న రోల్ చేశాను. కొత్త హీరోహీరోయిన్లు నటిస్తున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది”అని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్, అశ్వనీదత్, దిల్‌రాజు, శ్రీకాంత్, ఎం.ఎం.కీరవాణి, శోభుయార్లగడ్డ, రోషన్, శ్రీలీల, గౌరి రోణంకి తదితరులు పాల్గొన్నారు.

Chiranjeevi speech at ‘Pelli SandaD’ Pre Release Event

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News