Tuesday, April 23, 2024

‘లూసిఫ‌ర్’ రీమేక్‌ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మోహ‌న్‌రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లూసిఫ‌ర్’ రీమేక్ చిత్రం‌ ప్రారంభమైంది. హైదరాబాద్ లో బుధవారం పూజా కార్య‌క్రమాల‌తో ఈ మూవీ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్యాక్రమంలో స్టార్ ప్రడ్యూసర్ అల్లు అర‌వింద్‌, అశ్వినీ ద‌త్‌, డీవివి దాన‌య్య‌, నిరంజన్‌ రెడ్డి, థ‌మ‌న్‌, నాగ‌బాబు, కొరటాల శివ‌, ర‌చ‌యిత స‌త్యానంద్‌తోపాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు పాల్గొన్నారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్వీఆర్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై ఎన్వీ ప్ర‌సాద్, ఆర్ బీ చౌదరి కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరు 153వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రారంభం కానుంద‌ని చిత్రబృందం తెలిపింది.

Chiranjeevi’s Lucifer remake launched

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News