Home తాజా వార్తలు గేల్ కు వైస్ కెప్టెన్సీ…

గేల్ కు వైస్ కెప్టెన్సీ…

Chris Gayleవిండీస్ సీనియర్ ఆటగాడు, స్టార్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసిన విండీస్ బోర్డు తాజాగా గేల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించింది. మెగా టోర్నీలో విండీస్ సారథిగా ఉన్న యంగ్ ప్లేయర్ జాసన్ హోల్డర్ కు గేల్ అనుభవం పనికి వస్తుందని బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. 39 ఏళ్ల గేల్ ఇప్పటి వరకు 289 వన్డేలాడి 10వేలకు పైగా పరుగులు చేశాడు. అంతేగాక గేల్ కు ఇది ఐదో వరల్డ్ కప్ టోర్నీ. తనకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై గేల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ ప్రపంచకప్ మాకు చాలా ముఖ్యమైనదని, విండీస్ అభిమానులు మాపై భారీ అంచనాలు పెట్టుకున్నారన్న గేల్ వాటిని అందుకుంటామని చెప్పారు. ప్రస్తుతం కరేబియన్ జట్టు ఐర్లాండ్, బంగ్లాదేశ్ లతో ట్రై సిరీస్ ఆడుతోంది. ఈ టోర్నీలో విండీస్ కు వైస్ కెప్టెన్ గా వికెట్ కీపర్ షై హోప్ ఉన్నాడు. 50 వన్డేలు మాత్రమే ఆడిన హోప్ కంటే ఎంతో అనుభవం గల గేల్ అయితే జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని విండీస్ బోర్డు గేల్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కాగా, 1975, 1979లో వరుసగా వరల్డ్ కప్ గెలిచిన విండీస్ 1983లో భారత్ చేతిలో ఫైనల్ లో ఓడిపోయింది. ఆ తరువాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేదు. 2019 ప్రపంచకప్ లో కరేబియన్ జట్టు తన తొలి మ్యాచ్ లో మే 31న నాటింగ్ హాంలో పాకిస్థాన్ తో తలపడనుంది.

Chris Gayle named West Indies vice captain for World Cup