Home వార్తలు 19న వస్తున్న ‘చుట్టాలబ్బాయి’

19న వస్తున్న ‘చుట్టాలబ్బాయి’

CHUTTALABBAYIఆది హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి నిర్మించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ చిత్రం అన్ని కార్య క్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 19న ప్రపం చవ్యాప్తంగా రిలీజవుతోంది. నైజాంగ్‌లో భాగ్యశ్రీ ఫిలింస్ ద్వారా రాకేష్ ఈ చిత్రాన్ని 125 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్ తలారి, రామ్ తాళ్లూరి మాట్లాడుతూ “చక్కని ఫ్యామి లీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మా ‘చుట్టాల బ్బాయి’ చిత్రాన్ని ఈనెల 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల విడు దలైన సినిమా ఆడియోకు అద్భుతమైన స్పం దన వస్తోంది. కుటుంబ సమేతంగా అంద రూ చూసి ఎంజాయ్ చేసేవిధంగా దర్శకుడు వీరభద్రమ్ ఈ చిత్రాన్నిరూపొందించారు. ఆది పర్‌ఫార్మెన్స్ హైలైట్‌గా చాలా ఎక్స్‌ట్రా ర్డినరీగా ఈ చిత్రం రూపొందింది. ఆది, వీర భద్రమ్ ఫస్ట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సిని మా సూపర్‌హిట్ అయి మా బ్యానర్స్‌కు చా లా మంచి పేరు తెస్తుందన్న నమ్మకముంది”అని అన్నారు. ఆది, నమిత ప్రమోద్, సాయికుమార్, బ్రహ్మానం దం, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, రఘుబాబు, కృష్ణభగవాన్, అభిమన్యుసింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎ స్.తమన్, సినిమాటోగ్రఫీ: ఎస్.అరుణ్‌కుమార్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటింగ్:ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవాని ప్రసాద్.