Friday, March 29, 2024

ఎసిబి అధికారుల ఎదుట లొంగిపోయిన సిఐ బలవంతయ్య

- Advertisement -
- Advertisement -

CI Balavantaiah

 

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌లో అడ్మిన్ ఎస్సై సుధీర్‌రెడ్డి రూ. 50వేలు తీసుకుంటు పట్టుబడిన కేసులో మరో నిందితుడు సిఐ బలవంతయ్య శుక్రవారం నాడు నేరుగా ఎసిబి అధికారుల ఎదుట లొంగిపోయాడు. సినీ పరిశ్రమలో ప్రైవేట్ వ్యాపారం చేస్తున్న వంశీకృష్ణ కేసు(406 ఐపిసి)లో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, లోక్‌అదాలత్‌లో కేసును సెటిల్ చేస్తానంటూ సిఐ బలవంతయ్య రూ. లక్ష డిమాంద్ చేయడంతో బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. దీంతో మొదటి విడతగా రూ. 50 వేల మొత్తాలతో పాటు రెండు విదేశీ లిక్కర్ బాటిళ్లు(వ్యాట్ 69)ను ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం విదితమే. ఈకేసులో కీలక పాత్ర వహించిన సిఐ బలవంతయ్య అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.

సినీ పరిశ్రమలో ప్రైవేట్ వ్యాపారం చేస్తున్న వంశీకృష్ణ ఓ మహిళకు రూ. 30 వేల రూపాయల విలువ చేసే ఉత్పత్తులను అందజేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో సదరు మహిళ జూబ్లీహిల్స్ పిఎస్‌లో వంశీకృష్ణపై ఫిర్యాదు చేసింది. ఎస్సై సుధీర్‌రెడ్డి ఫిర్యాదు నమోదు చేసుకొని గత నెల డిసెంబర్ 27న వంశీకృష్ణను స్టేషన్‌కు పిలిపించారు. ఈ కేసు విషయం సిఐ బలవంతరావు రూ.లక్షల లంచం డిమాండ్ చేయడంతో వంశీకృష్ణ ససేమిర అనడంతో పోలీసులు అతన్ని మూడు రోజులపాటు తీవ్ర ఇబ్బందులపాలు చేశారు. వంశీకృష్ణ లంచం ఇవ్వకపోవడంతో అతనిపై గత నెల డిసెంబర్ 29న ఛీటింగ్ కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. ఈ కేసు విషయమై ఇద్దరి మద్య రాజీ కుదిర్చేందుకు ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి వంశీకృష్ణతో బేరసారాలు జరిపారు.

చివరికి లక్ష రూపాయలు, విదేశీ మద్యం బాటిళ్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని వంశీకృష్ణ ఎసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గురువారం రూ. 50వేలు, రెండు వ్యాట్ 69 విదేశీ మద్యం బాటిళ్లు ఇవ్వడానికి జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10 వంశీకృష్ణ వెళ్లడం, వాటిని తీసుకునేందుకు ఎస్సై సుధీర్‌రెడ్డి రావడంతో ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం జరిగిపోయాయి. ఈ కేసు విచారణలో సిఐ బలవంతరావు ఆదేశాల మేరకు తాను ఈ పని చేశానని, రూ. 50వేలలో రూ. 30వేలు సిఐకి, రూ. 20వేలు తన భాగమని ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి ఎసిబి డిఎస్‌పి విచారణలో వెల్లడించాడు. దీంతో పోలీసులు సిఐ బలవంతరావుపై క్రైం నంబ 59/2019 కేసు నమోదు చేశారు. కాగా సిఐ బలవంతయ్య నేరుగా ఎసిబి అధికారుల వద్ద లొందగిపోవడంతో అతన్ని ఎసిబి కోర్టులో హాజరు పరిచారు.

CI Balavantaiah surrender to ACB officials
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News