Home తాజా వార్తలు సిఐ భార్య ఆత్మహత్యాయత్నం

సిఐ భార్య ఆత్మహత్యాయత్నం

CI Wife Suicide Attempt

 

సంగారెడ్డి: రాష్ట్ర పోలీస్ శాఖలో ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజయ్య భార్య, పిల్లలతో సహా ఎల్‌బి నగర్‌లోని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆత్మహత్యాయత్నం చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సంగారెడ్డి జిల్లా ఎస్‌బి విభాగంలో ఇన్స్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రాజయ్య, తనను వివాహం చేసుకున్న తర్వాత మరో మూడు వివాహలు తనకు తెలియకుండా చేసుకున్నాడని రేణుక పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. తన కేసును పోలీసులు పట్టించుకోకుండా తనపైనే అట్రాసిటీ కేసు నమోదు చేశారని, ఇక తనకు న్యాయం జరగదని ఆమె ఆరోపించింది. గతకొంత కాలంగా తనను, పిల్లలను రాజయ్య పట్టించుకోవడంలేదని బోరున విలపించింది.

దీంతో తాను మానసికంగా కుంగి ఇక తాను తన ముగ్గురు కుమారులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని బాటిల్‌లో పెట్రోల్ తీసుకుని రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయం ఎదుటనే ఆత్మహత్యకు ఉపక్రమించామని తెలిపింది. పోలీసులు తనకు న్యాయం చేయకపోగా తనపైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాజయ్య నాలుగో ఫిర్యాదు మేరకు తనపై కేసు నమోదు చేశారంటూ విలపించింది. అయితే కమిషనరేట్ ఎదుట జరిగిన ఆత్మహత్య యత్నాన్ని అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని, ఆమెకు పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. తదనంతరం ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

CI Wife Suicide Attempt in Sangareddy