Wednesday, April 24, 2024

చంద్రుడినీ వదిలేది లేదు: రష్యా డైరెక్టర్ క్లిమ్

- Advertisement -
- Advertisement -

Cinema shooting on Moon and Mars

మాస్కో : చంద్రుడు, అంగారకుడిపై కూడా సినిమా చిత్రీకరణకు సిద్ధంగా ఉన్నామని రష్యా సినిమా దర్శకులు క్లిమ్ షిపెంకో ప్రకటించారు. తమ తదుపరి సినిమా ది ఛాలెంజ్ చిత్రీకరణకు వేదికగా అంతరిక్షాన్ని ఎంచుకున్నారు. దీని కోసం సినిమా నటితో ఇతరులతో కలిసి 12 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో గడిపి ఇటీవలే వచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ పెట్టారు. సహజత్వానికి ఎటువంటి సవాళ్లు అయినా ఎదుర్కొని భూమికి ఆవలి ప్రాంతాలకు కూడా వెళ్లి షూటింగ్‌లు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ క్రమంలో చంద్రుడిపై సినిమా తీయడం కాదు చంద్రుడి ఉపరితలంపైనే చిత్రీకరణ , అదే విధంగా అవసరం అయితే మార్స్‌పై కూడా షూటింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు రోదసిని నేపథ్యంగా తీసుకుని సినిమా తీసినట్లు దీని కోసం ఈ ఛాలెంజర్ సినిమాలో వాడేందుకు 30 గంటల మేర స్పేస్ నిజమైన వాతావరణాన్ని చిత్రీకరించి వచ్చినట్లు తెలిపారు. దర్శకుడితో పాటు నటి యూలియా పెరెసిల్డ్ కూడా వెళ్లారు. పూర్తి స్థాయి స్పేస్ సినిమా ప్రపంచ రికార్డు అవుతుందని రష్యా మీడియా తెలిపింది. ఇప్పుడు అంతరిక్షంపై సినిమా అనుకున్నాం, అక్కడికి వెళ్లాం, చంద్రుడిపై తీయాలనుకుంటే అక్కడికీ పోతామని, అంగారకుడిపైకి వెళ్లడానికి అయినా సిద్ధమేనని ఈ దర్శకుడు తేల్చిచెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News