Home ఆంధ్రప్రదేశ్ వార్తలు రోడ్డు ప్రమాదంలో సిఐ మృతి

రోడ్డు ప్రమాదంలో సిఐ మృతి

Circle inspector dead in Road accident

అమరావతి: రోడ్డు ప్రమాదంలో సిఐ మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. త్రీ టౌన్ సిఐ ఈశ్వర్ రావు తన సిబ్బందితో కలిసి పోలీసు జీపులో ఎండాడ జాతీయ రహదారిపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో సిఐ ఘటనా స్థలంలో చనిపోగా ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జీపు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వేకువజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం కోసం సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.